జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...

16 Nov, 2021 12:52 IST|Sakshi

మనం చాలా రకాల ఇంటర్వ్యూలు చూసి ఉంటాం. అంతేందుకు ఒక్కొసారి మనల్ని ఇబ్బందికి గురి చేసేలా ఇంటర్వ్యూయర్ వేసే ప్రశ్నలకు కూడా మనం ఓపికగా సమాధానం ఇస్తాం. అయితే ఒక్కొసారి మనం ఏమైన సందేహాల్ని వెలిబుచ్చితే మాత్రం ఇంటర్వ్యూయర్లు చాలా మటుకు సరిగా సమాధానమైతే మనకు ఇవ్వరు. పైగా చాలా గర్వంగా సమాధానాలిస్తారు. మరికొంత మంది అయితే చాలా తెలివిగా సమాధానాలు చెబుతూ మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. అచ్చం అలానే ఇక్కొడ ఇంటర్వ్యూయర్ ఒక ఆమెను ఇబ్బంది పెట్టడమే కాక సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటాడు.

(చదవండి: భారత్‌, పాకిస్తాన్‌ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు)

అసలు విషయంలోకెళ్లితే...ఒక వ్యక్తి స్కైప్‌లో ఒక మహిళను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ చాలా మంచిగా ఆసక్తికరంగా సాగి పోతుంటుంది. చివరిగా జీతం గురించి ప్రస్తావన కొచ్చినప్పుడు సదరు మహిళ సాధారణంగా మీరు ఒక గంట పనికి ఎంత జీతం చెల్లిస్తారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. అలా అడగటమే కాక అమెకరికన్‌​ ఎటర్‌ప్రెన్యూర్‌ అండ్‌ మోటివేషనల్‌ స్పీకర్‌ జిమ్‌ రోన్‌ కొటేషన్‌.." నేను ఎంత పొందుతున్నాను అనే బదులు  ఈ పని చేయడం వల్ల నేనేం పొందగలుగుతున్నాను" అనే సందేశాన్ని కూడా జోడించి అడుగుతుంది. దీంతో సదరు ఇంటర్వ్యూయర్ స్వారీ అంటూ ఒక ఎరుపు రంగు జెండాను చూపిస్తాడు.

దీంతో సదరు మహిళ క్షమించండి నేను చెల్లించాల్సిన బిల్లులు, ఇతర ఇంటర్వ్యూల గురించి కూడా ఆలోచించాల్సి ఉంది కాబట్టి నాకు ఎంత జీతం చెల్లిస్తారో చెప్పాల్సిందే అంటూ పట్టుబడుతుంది. అయితే ఇంటర్వ్యూయర్ నుంచి ఎటువంటి సమాధానం రాదు. ఆ తర్వాత ఆమె ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన సందేశాలను మొత్తం స్క్రీన్‌ షాట్‌ తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది. దీంతో నెటిజన్లు సదరు ఇంటర్వ్యూ తీరుని చూసి షాక్‌ అవ్వుతూ ..మేము ఉద్యోగులకు తక్కువ జీతం ఇస్తాం అని పరోక్షంగా చెబుతున్నట్లే అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!)

మరిన్ని వార్తలు