బైడెన్‌ డిజిటల్‌ టీంలోకి కశ్మీరి మహిళ

29 Dec, 2020 09:50 IST|Sakshi
వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్‌గా నియమితులైన ఈషా షా(ఫైల్‌ ఫోటో)

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ మరో భారతీయురాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్‌గా మరో భారతీయురాలిని నియమించారు. కశ్మీర్‌లో జన్మించిన ఈషా షాను ఈ పదవికి ఎంపికచేశారు. డిజిటల్‌ స్ట్రాటజీ డైరెక్టర్‌గా రాబ్‌ ప్లాహెర్టీ నేతృత్వం వహించనున్నట్లు బైడెన్‌ ట్రాన్సిషన్‌ బృందం ఒక ప్రకటనలో తెలిపింది. లూసియానాలో పెరిగిన షా గతంలో బైడెన్‌-హారిస్‌ ప్రచారంలో డిజిటల్‌ భాగస్వామ్య నిర్హాకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు జాన్‌ఎఫ్‌ కెన్నడీ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ కార్పోరేట్‌ ఫండ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గాను, ఇంటిగ్రేటెడ్‌ మార్కెటింగ్‌ సంస్థ బ్యూరు కమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌గానూ పనిచేశారు. (చదవండి: భారత్‌తో చెలిమికే బైడెన్‌ మొగ్గు!)

ఇక ఇప్పటికే బైడెన్‌ తన టీంలో కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్ చీఫ్‌గా, వేదాంత్ పటేల్‌లకు వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా, వినయ్‌ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా నియమించగా.. గౌతమ్‌ రాఘవన్‌కి కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి జాబితాలో ఈషా షా కూడా చేరారు. 

మరిన్ని వార్తలు