Corona Vaccination:జో బైడెన్​ సంచలన నిర్ణయం

10 Jun, 2021 14:43 IST|Sakshi

వాషింగ్టన్​:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యాభై కోట్ల ఫైజర్​ వ్యాకిన్ డోసులను కొనుగోలు చేసి.. పేద దేశాలకు ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంపై ఇప్పటికే కసరత్తులు పూర్తయ్యానని, బైడెన్​ నోటి నుంచి అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని వైట్​హౌజ్​ ఉటంకించినట్లు అమెరికాలోని ప్రముఖ వెబ్​సైట్స్​ ఒక కథనం ప్రచురించాయి.

కాగా, ఫైజర్​ బయోఎన్​టెక్​ కొవిడ్ 19 వ్యాక్సిన్​ 500 మిలియన్ల డోసులు కొనుగోలు చేయాలని బైడెన్​ పాలనా విభాగం ప్రణాళిక వేసింది. వీటిని వంద పేద దేశాలకు వీటిని పంచబోతోంది. ఈ ఏడాది చివరికల్లా 200 మిలియన్​ డోసులు, మిగిలిన 300 మిలియన్​ డోసులు వచ్చే ఏడాది కల్లా అందించాలని నిర్ణయించుకుంది. ఇక ఈ భారీ సాయంపై పోయిన నెలలోనే బైడెన్​ నిర్ణయం తీసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్​ కథనం ప్రచురించింది. ‘‘కరోనాను అంతం చేయాల్సిన అవసరం ఉంది. అది అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో నలుమూలలా. వ్యాక్సిన్​ డోసుల డొనేషన్​లో మీరు పాల్గొనండి. ముందుకు రండి’’ అని ప్రపంచదేశాలను ఉద్దేశించి బైడెన్​ వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్​ పోస్ట్ వెబ్​ సైట్​ పేర్కొంది. 

ప్రపంచం మొత్తం వ్యాక్సిన్​ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో బైడెన్​ భారీ సాయంపై హర్షం వ్యక్తం అవుతోంది. కాగా, అమెరికా ఇదివరకే 300 మిలియన్ల ఫైజర్​ డోసుల కోసం ఒప్పందం చేసుకోగా.. ఇప్పుడు సాయం ప్రకటన నేపథ్యంలో అదనంగా 500 మిలియన్ల డోసుల కొనుగోలు కోసం మరో ఒప్పందం చేసుకుంది. యూఎస్​, యూకేలో 42 శాతం జనాభాకు వ్యాక్సినేషన్​ పూర్తికాగా, ఆఫ్రికాదేశాల్లో ఒక్క శాతం కంటే తక్కువ జనాభాకు వ్యాకినేషన్​ జరిగింది. దీంతో ముందుగా ఆఫ్రికన్​ దేశాలకే అందించాలని బైడెన్​ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోవాక్స్​ ద్వారా 75 శాతం డోసుల్ని పంపిణీ చేయనున్నట్లు వైట్​హౌజ్​ ప్రకటించింది. ఇక  ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్​ ​ కొరత తీరాలంటే పదకొండు బిలియన్ల డోసులు అవసరమని డబ్ల్యూహెచ్​వో భావిస్తుండగా.. బైడెన్​ సాయం ప్రకటన కొంతలో కొంత ఊరట ఇచ్చేదే.  జీ7 సమ్మిట్​లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

చదవండి: ఇజ్రాయెల్‌–పాలస్తీనా వివాదానికి ఏకైక పరిష్కారమిదే

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు