19 నాటికి అర్హులైన అమెరికన్లందరికీ టీకా

8 Apr, 2021 02:41 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 1 నాటికి యువతతో సహా పెద్దలందరికీ టీకా అందజేయాలని గతంలోనే లక్ష్యంగా నిర్దేశించుకోగా, తాజా పరిస్థితి దృష్ట్యా ఈ గడువును దాదాపు 2 వారాలు ముందుకు జరిపారు. ఏప్రిల్‌ 19 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా ఇస్తామని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.

18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారంతా కరోనా టీకాకు అర్హులేనని వెల్లడించారు. వీరందరికీ ఏప్రిల్‌ 19 నాటికి టీకా పంపిణీని పూర్తి చేస్తామన్నారు. టీకా పంపిణీలో ముందంజలో ఉన్నామని వివరించారు. కేవలం 75 రోజుల్లో రికార్డు స్థాయిలో 15 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చామని గుర్తుచేశారు. అమెరికా ఇప్పటికీ ‘లైఫ్‌ అండ్‌ డెత్‌ రేసు’లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ ఇచ్చేదాకా జాగ్రత్తలు పాటించాలని కోరారు.  శుభ్రత, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం  చేయాలన్నారు.

మరిన్ని వార్తలు