అధ్యక్ష ఎన్నికల తర్వాతే నూతన జడ్జి నియామకం

21 Sep, 2020 08:38 IST|Sakshi

ట్రంప్‌ ప్రతిపాదనకు 53 మంది రిపబ్లికన్లు వ్యతిరేకం

వాషింగ్టన్‌: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌(87) శుక్రవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో నూతన న్యాయమూర్తిని నియమిస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది. అధ్యక్ష ఎన్నికల అనంతరం నూతన ప్రెసిడెంట్‌ కొత్త జడ్జిని నియామించాలంటూ డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌.. ట్రంప్‌ సుప్రీం కోర్టుకు నామినేట్‌ చేసే ఏ అభ్యర్థికి కూడా ఓటు వేయవద్దని సెనేట్‌ రిపబ్లికన్లను కోరారు. ట్రంప్‌ తన రాజకీయ ప్రయోజనం కోసం ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారని తెలిపారు. అధ్యక్షుడి ప్రణాళిక మేరకు ప్రస్తుత నియామకాన్ని సెనేట్‌ ఆమోదిస్తే.. అప్పుడు 6-3 మెజారిటీ వస్తుంది.. ఇది అమెరికన్ల చట్టాలని, జీవితాన్ని దశాబ్దాలుగా ప్రభావితం చేస్తుందన్నారు బైడెన్‌. (చదవండి: రూత్‌ స్థానంలో మహిళనే నామినేట్‌ చేస్తాం)

అంతేకాక ‘సుప్రీం కోర్టు జడ్జీ నియామకంలో ఈ దేశ ఓటర్లు పాలు పంచుకోవాలి. రాజ్యంగం ద్వారా తమకు లభించిన హక్కు మేరకు వారు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రజలు ఆమోదించిన నాయకుడు ఈ నియమాకాన్ని చేపట్టాలి’ అన్నారు బైడెన్‌. ట్రంప్‌ ప్రతిపాదనను అంగీకరిస్తే.. నిరంతరాయమైన రాజకీయ దాడులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అన్నారు. అలానే తనకు అవకాశం వస్తే ఒక ఆఫ్రికన్‌-అమెరికన్‌ మహిళని సుప్రీం కోర్టుకు నామినేట్‌ చేస్తానని బైడెన్‌ పునరుద్ఘాటించారు. ఇది చాలా చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు. 100 సీట్ల చాంబర్‌లో ఇప్పటికే ట్రంప్‌ ప్రతిపాదనను 53 మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. వీరితో పాటు 62 శాతం మంది అమెరికన్‌లు నూతన అధ్యక్షుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తిని నియమించాలని భావిస్తున్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. చికాగోకు చెందిన 7 వ యుఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు చెందిన అమీ కోనీ బారెట్, అట్లాంటాకు చెందిన 11 వ సర్క్యూట్‌కు చెందిన బార్బరా లాగోవాలను గిన్స్‌బర్గ్ సృష్టించిన ఖాళీని భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థిగా ట్రంప్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు