Joe Biden: 'ప్రేమంటే ప్రేమే!' ఆ బిల్లుపై తక్షణమే గర్వంగా సంతకం చేస్తా

30 Nov, 2022 19:22 IST|Sakshi

అమెరికా సెనేట్‌ స్వలింగ, కులాంతర వివాహాలను రక్షించడానికి సంబంధించిన కీలక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుకు 12 మంది రిపబ్లికన్లతో సహా 61 మంది సభ్యుల్లో దాదాపు 36 మంది సభ్యుల ఆమోదం లభించింది. ఈ మేరకు సెనేట్‌ మెజారిటీ లీడర్‌ చక్‌ షుమేర్‌ మాట్లాడుతూ...ఈ చట్టం చాలా కాలంగా వస్తోంది కానీ ఇప్పుడే ఆమోదం లభించింది. స్వలింగ, వర్ణాంతర వివాహాలను సమాఖ్య చట్టంలో పొందుపరిచేలా చేసింది ఈ బిల్లు. అమెరికా నిష్కళంకమైన సమానత్వం వైపు  అడుగులు వేసేలా కీలకమైన బిల్లును ఆమెదించిందని అన్నారు.

ఈ బిల్లు ప్రకారం యూఎస్‌ ఫెడరల్‌ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తుల వివాహం చేసుకుంటే అది ఆ రాష్ట్రంలో చెల్లుబాటు అయితే కచ్చితంగా దాన్ని గుర్తించాలి. అలాగే యూఎస్‌ రాజ్యంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన వివాహాల గుర్తింపుకు పూర్తి హామీ ఇస్తోంది. అంతేగాక యూఎస్‌ రాష్ట్రాలు తమ చట్టాలకు విరుద్ధంగా వివాహా లైసెన్స్‌ను జారీ చేయాల్సిన అవసరం ఈ బిల్లుకు లేదు. ద్వైపాక్షిక ఎ‍న్నిక ద్వారా ఈ చట్టాన్ని రూపొందించారు.

అంతేగాక స్వలింగ వివాహాలను జరుపుకోవడానికి అవసరమయ్యే వస్తువులు లేదా సేవలను అందించడానికి ఇష్టపడని సంస్థలకు మతపరమైన రక్షణను అందించే సవరణ కూడా ఉంది. ఈ బిల్లు మతస్వేచ్ఛ పునరుద్ధరణ చట్టం రక్షణను తగ్గించడం లేదా రద్దు చేయడం వంటివి చేయకుండా నిరోధించే నిబంధనను కలిగి ఉంది. జూలైలో ఆమోదించిన ఈ బిల్లుపై యూఎస్‌ అధ్యక్షుడు జోబైడెన్‌ సంతకం చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించింది. సెనేట్ నవంబర్‌లో ఎన్నికల రోజు, జనవరిలో అధికారం చేపట్టే కొత్త చట్టసభల మధ్య ఈ బిల్లును ఆమోదించింది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ....ఈ ద్వైపాక్షిక ఓటును ప్రశంసించడమే కాకుండా సెనేట్‌ ఈ బిల్లును ఆమోందించనట్లయితే గర్వంగా ఆ బిల్లుపై సంతకం చేస్తాను. స్వలింగ సంపర్కులైన యువత తాము పూర్తి సంతోషకరమైన జీవితాలను గడిపి, స్వంత కుటుంబాలను రూపొందించుకునేలా ఈ బిల్లు చేస్తోంది. సెనేట్‌ రెస్పెక్ట్‌ ఫర్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ని ఆమెదించడంతో అమెరికా ఒక ప్రాథమిక సత్యాన్ని పునరుద్ఘాటించే అంచున నిలబడి ఉంది. 'ప్రేమనేది ఎప్పటికే ప్రేమే' అమెరికన్లు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకునే హక్కును కలిగి ఉండాలి. అని బైడెన్‌ అ‍న్నారు. 

(చదవండి: చిన్నారికి అత్యవసర శస్త్ర చికిత్స...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు)

మరిన్ని వార్తలు