భారత్‌పై బైడెన్‌ ప్రశంసలు.. చైనాపై విమర‍్శలు..

24 May, 2022 12:38 IST|Sakshi

Joe Biden praised Prime Minister Narendra Modi.. క్వాడ్‌ సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జపాన్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సదస్సులో భాగంగా మంగళవారం మోదీతో జో బైడెన్‌ భేటీ అయ్యారు. ఈ క్రమంలో భారత్‌ను బైడెన్‌ ప్రశంసించారు. అదే సమయంలో చైనా విఫలమైందంటూ వ్యాఖ్యలు చేశారు. 

వివరాల ప్రకారం.. క్వాడ్‌ సమ్మిట్‌లో భాగంగా టోక్యోలో మంగళవారం క్లోజ్డ్ సెషన్‌లో ప్రధాని మోదీ, బైడెన్‌ భేటీ అ‍య్యారు. ఈ సందర్బంగా కోవిడ్‌ మహ్మారిని ఎదుర్కొవడంతో భారత్‌ సక్సెస్‌ అయిందని.. ప్రధాని నరేంద్ర మోదీని బైడెన్‌ ప్రశంసించారు. ఇదే సమయంలో కరోనాను ఎదుర్కోవడంలో చైనా పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. అలాగే, ప్రజలకు ప్రజాస్వామ దేశాలే అభివృద్ధిని అందించగలవని అన్నారు. 

చైనా, రష్యా వంటి దేశాలు నిరంకుశ దేశాలు అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, జపాన్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండో పసిఫిక్ ట్రేడ్ డీల్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో అమెరికా, ఇతర క్వాడ్ దేశాలు(అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్) సహా 12 దేశాలు భాగమయ్యాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: పుతిన్‌తో తప్ప మరే అధికారితో సమావేశం అవ్వం: జెలెన్‌స్కీ

మరిన్ని వార్తలు