అమెరికాను అగ్రపథంలో నిలుపుతాం!

26 Nov, 2020 04:37 IST|Sakshi
జాన్‌ కెర్రీ, అవ్రిల్‌ హెయిన్స్‌ ,లిండా థామస్‌, జేక్‌ సల్లివన్‌

ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ బైడెన్‌ బృందం విశ్వాసం

వాషింగ్టన్‌: ‘‘అమెరికా ఈజ్‌ బ్యాక్‌’’ నినాదంతో పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ చెప్పారు. కీలకమైన జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలకు సంబంధించి తన హయాంలో పనిచేయబోయే అధికారులను ఆయన వెల్లడించారు. ప్రపంచాన్ని ముందుకు నడిపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా సంక్షోభం, క్లైమేట్‌ చేంజ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనాలని, సరికొత్త స్నేహితాలు రూపొందించుకోవాలని అభిప్రాయపడ్డారు. గతంలో ప్రపంచానికి పెద్దన్నగా అమెరికా పోషించిన పాత్రను తిరిగి చేపట్టాలని ప్రపంచదేశాలు భావిస్తున్నాయన్నారు. స్నేహితులతో కలిసి పని చేస్తే అమెరికా బలమైనదన్న తన అభిప్రాయానికి తన బృందం గట్టి మద్దతన్నారు.

కొత్త టీమ్‌ ఇదే..
► సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అంటోనీ బ్లింకెన్‌.
► ప్రెసిడెన్షియల్‌ ఎన్వాయ్‌ ఫర్‌ క్లైమేట్‌(పర్యావరణ అంశాల ప్రతినిధి) జాన్‌ కెర్రీ.
► సెక్రటరీ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ అలెజాండ్రో మయోర్కస్‌.
► డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ అవ్రిల్‌ హెయిన్స్‌.
► ఐరాసలో యూఎస్‌ దౌత్యవేత్త లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌.
► నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జేక్‌ సల్లివన్‌.
► చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రాన్‌ క్లెయిన్‌.
► కోట్ల ఓట్లతో గెలిచిన అధ్యక్షుడు

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 8 కోట్లపై చిలుకు ఓట్లతో గెలిచిన తొలి ప్రెసిడెన్షియల్‌ క్యాండిడేట్‌గా జోబైడెన్‌ చరిత్ర సృష్టించారు. కౌంటింగ్‌ కొనసాగుతున్నందున ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా. మంగళవారానికి బైడెన్‌కు 8కోట్ల 11వేల ఓట్లు రాగా, ట్రంప్‌నకు 7.38 కోట్ల ఓట్లు వచ్చాయి. ఇది కూడా ఒక రికార్డేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎట్టకేలకు చైనా అధ్యక్షుడు జింగ్‌ పింగ్‌ అమెరికా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జోబైడెన్‌ను అభినందించారు. రెండు దేశాల నడుమ సత్సంబంధాలు నెలకొనాలని ఆకాంక్షించారు.

>
మరిన్ని వార్తలు