గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఊరట..

26 Feb, 2021 04:48 IST|Sakshi

ట్రంప్‌ వీసా విధానం వెనక్కి తీసుకున్న బైడెన్‌

వాషింగ్టన్‌:  ట్రంప్‌ అమెరికా అధినేతగా ఉన్నప్పు డు తీసుకున్న ఎన్నో నిర్ణయాలను తిరగతోడుతున్న అధ్యక్షు డు బైడెన్‌ గ్రీన్‌ కార్డు దరఖాస్తుదా రులకి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో దేశంలోకి అడుగుపెట్ట కుండా వీసాలపై ట్రంప్‌ హయాంలో విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకు న్నారు. ఈ మేరకు బుధవారం అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డుల దరఖాస్తుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. కరోనా సమయంలో ఏర్పడిన నిరుద్యోగాన్ని గాడిలో పెట్టాలంటే వీసాలపై నిషేధమే సరైనదంటూ అప్పట్లో ట్రంప్‌ నిర్ణయిం చారు. అయితే బైడెన్‌ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

వీసాలపై నిషే«ధం ఉండడం వల్ల ఎందరో ఉద్యోగులు కుటుంబాలకు దూరమై మానసిక వేదన అనుభవిస్తారని, దాని ప్రభావం అమెరికా వాణిజ్యంపైనే పడుతుందని అన్నారు. ‘‘ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఎన్నో పరిశ్రమలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావం తుల సేవల్ని వినియోగించు కోకుండా నిరోధిస్తుంది. ఇక అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందిన వారు రానివ్వకుండా చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఉద్యోగుల్ని వారి కుటుంబ సభ్యులు కలవనివ్వకుండా చేస్తోంది. అందుకే వీసాపై నిషేధాన్ని ఎత్తేస్తున్నాను’’ అని బైడెన్‌ చెప్పారు. బైడెన్‌ నిర్ణయంతో హెచ్‌–1బీ వీసాపైన అమెరికాలో ఉన్న ఎందరో భారతీయ టెక్కీలు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు