రిషి సునాక్ బ్రిటన్‌ ప్రధాని కావడంపై బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

25 Oct, 2022 11:03 IST|Sakshi

వాషింగ్టన్‌: కన్జర్వేటివ్‌ పార్టీలో తన నాయకత్వనికి బహిరంగంగా తిరుగుబాటు రావడంతో లిజ్‌ట్రస్‌ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అనుహ్య రీతిలో తప్పుకోవడం, మరో ప్రత్యర్థి పెన్నీ మోర్డాంట్  కావల్సినంత మంది ఎంపీల మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో బ్రిటన్‌ కొత్త ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మార్గం సుగమమైంది.

నెలన్నరరోజుల క్రితం లిజ్‌ట్రస్‌ చేతిలో ఓడిపోయిన అదే రిషి సునాక్‌ తిరిగి ప్రధానిగా బ్రిటన్‌ పగ్గాలు చేపట్టడం విశేషం. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకలో మాట్లాడుతూ...."సునాక్‌ విజయం చాలా ఆశ్చర్యకరమైనది. ఈ విజయం ఒక సంచలనాత్మక మైలురాయి. ఆయనకు అధికారిక అభినందనలు తెలిపేందుకు ఎదురు చూస్తున్నాను" అని అన్నారు. ఈ క్రమంలో వైట్‌హౌస్‌ ప్రతినిధి కరీన్‌ జీన్‌ పియరీ బ్రిటన్‌ ప్రధాని సునాక్‌.. కింగ్‌ చార్లెస్‌తో ప్రోటోకాల్‌ సమావేశం జరిగిన తదనంతరం ఆయనతో బైడెన్‌ సంభాషించనున్నట్లు పేర్కొన్నారు.
(చదవండి: అమెరికా వైట్‌హౌస్‌లో అంగరంగ వైభవంగా దీపావళి: వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు