ముప్పు లేకుండా తరలింపు పూర్తి కాదు: బైడెన్‌

22 Aug, 2021 05:40 IST|Sakshi

వాషింగ్టన్‌: తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్‌ నుంచి తమ పౌరులను, భాగస్వామ్య దేశాల పౌరులను సాధ్యమైనంత త్వరగా స్వదేశాలకు చేరుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పునరుద్ఘాటించారు. ప్రాణాలకు ముప్పు లేకుండా తరలింపు ప్రక్రియ పూర్తి కాబోదని వ్యాఖ్యానించారు. జూలై నుంచి ఇప్పటిదాకా 18,000కు పైగా అమెరికన్లను సొంత దేశానికి తరలించామని చెప్పారు. సంక్లిష్టమైన పరిస్థితుల మధ్య తరలింపు చేపడుతున్నాం కాబట్టి తుది ఫలితం ఏమిటన్నది చెప్పలేనన్నారు. మరోవైపు, అఫ్గానిస్తాన్‌ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని యూకే ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని అన్నారు. 

మరిన్ని వార్తలు