చైనాకు వార్నింగ్‌ ఇస్తూనే ట్విస్ట్‌ ఇచ్చిన బైడెన్‌.. ఏమన్నారంటే?

9 Feb, 2023 09:40 IST|Sakshi

వాషింగ్టన్‌: డ్రాగన్‌ దేశం చైనా నిఘా బెలూన్ల ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. చైనా ఈ బెలూన్లతో కేవలం అమెరికా పైనే కాదు, ఇంకా చాలా దేశాలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. చైనా బెలూన్లు భారత్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికాకు చెందిన ‘ద వాషింగ్టన్‌ పోస్టు’ పత్రిక ఒక కథనంలో వెల్లడించింది. 

భారత్‌తోపాటు జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌లో ఉన్న కీలక వ్యూహాత్మక ప్రాంతాలను చైనా బెలూన్లు టార్గెట్‌ చేసినట్లు కథనంలో బహిర్గతం చేసింది. చైనా వైమానిక దళం నిఘా బెలూన్లను నిర్వహిస్తోందని, ఇవి ఐదు ఖండాలపై కనిపించినట్లు తెలియజేసింది. తన గగనతలంపై ఎగురుతున్న చైనా బెలూన్‌ను ఇటీవలే అమెరికా పేల్చేసిన∙సంగతి తెలిసిందే.  ఇతర దేశాలపై నిఘా కోసం చైనా ఈ బెలూన్లను తయారు చేసిందని, తద్వారా ఆయా సార్వభౌమత్వానికి విఘాతం కలిగించిందని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

మరోవైపు బెలూన్ల వ్యవహరంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంతకుముందు చైనాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఒక‌వేళ త‌మకు చైనా నుంచి ప్ర‌మాదం పొంచి ఉంటే, అప్పుడు దేశాన్ని ర‌క్షించుకునేందుకు స‌రైన రీతిలో స్పందిస్తామ‌ని అన్నారు. దానికి త‌గిన‌ట్లే వ్య‌వ‌హ‌రించామ‌ని కూడా ఆయ‌న తెలిపారు. తాజాగా బైడెన్‌ మాట్లాడుతూ.. చైనాతో జ‌రుగుతున్న వ్యాపార పోరాటంలో గెలుపు అనేది అంద‌ర్నీ క‌ల‌పాల‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌మ దేశానికి ఎన్నో స‌వాళ్లు ఉన్నాయ‌ని, గ‌త రెండేళ్ల‌లో ప్ర‌జాస్వామ్యాలు బ‌ల‌ప‌డ్డాయ‌ని, కానీ బ‌ల‌హీన‌ప‌డ‌లేద‌ని బైడెన్ తెలిపారు. అమెరికా ప్ర‌యోజ‌నాల కోసం చైనాతో క‌లిసి ప‌నిచేసేందుకు ఆస‌క్తిగా ఉన్నామ‌న్నారు. చైనాతో తాము పోటీనే కోరుకుంటున్నాము కానీ.. ఘర్షణలు కాదు అనే విషయాన్ని ఇప్పటికే జిన్‌పింగ్‌కు అర్థమయ్యేలా చెప్పినట్టు కామెంట్స్‌ చేశారు. 

>
మరిన్ని వార్తలు