‘బీ కేర్‌ఫుల్‌’.. చైనాకు జో బైడెన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

23 May, 2022 13:18 IST|Sakshi

Joe Biden Serious Warning to China on Taiwan: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ డ్రాగన్‌ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఒకవేళ తైవాన్‌ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తే ‘ప్రమాదంతో ఆటలాడుకున్నట్టే’ అంటూ బైడెన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అయితే, ఆసియా దేశాల పర్యటనలో భాగంగా అగ్ర రాజ్యం అధ‍్యక్షుడు బైడెన్‌ సోమవారం జపాన్‌ రాజధాని టోక్యో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ సమావేశంలో బైడెన్‌ మాట్లాడుతూ.. వ‌న్ చైనా పాల‌సీని తాము అంగీక‌రిస్తామ‌ని, ఆ ఒప్పందంపై సంత‌కం కూడా చేశామ‌ని చెప్పారు. ఈ క్రమంలోనే చైనా.. తైవాన్‌ను బలవంతంగా ఆక్రమించాలని చూస్తే.. తాము(అమెరికా) సైనిక‌ప‌రంగా చైనాను అడ్డుకుంటుదని హెచ్చరించారు. తైవాన్‌ను ఆక్ర‌మించే న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కు చైనాకు లేద‌ని బైడెన్ తెలిపారు. 

ఇక, తైవాన్‌ విషయంలో చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉక్రెయిన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని బైడెన్‌ హితవు పలికారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న అకృత్యాల‌కు పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ర‌ష్యా సుదీర్ఘ‌కాలం ఆ మూల్యాన్ని చెల్లించుకుంటుందని పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేస్తున్న సమయంలో చైనాకు పుతిన్‌కు ప్రత్యక్షంగా సపోర్ట్‌ చేసిన విషయం తెలిసిందే. రష్యాకు ఆర్థికంగా, ఆయుధాలను కూడా అందించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. 

ఇది కూడా చదవండి: భారత్‌ సహా 16 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌, ఎందుకంటే..

మరిన్ని వార్తలు