జో బైడెన్ కీలక ప్రతిపాదన, 100 రోజుల్లోనే..

15 Jan, 2021 08:36 IST|Sakshi

వాషింగ్టన్: కరోనా వైరస్‌ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రణాళిక రూపొందించారు. 1.9 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్రణాళికను ప్రకటించారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంతో సహా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. అమెరికన్ రెస్క్యూ ప్లాన్ పేరుతో జో బైడెన్‌ ఈ ప్రతిపాదన చేశారు. పాల‌న చేప‌ట్టిన 100 రోజుల్లోగా వంద మిలియ‌న్ల టీకాలు వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ప్ర‌ణాళిక త‌యారు చేశారు. ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిర‌త్వం కోసం మ‌రో ద‌ఫా సాయం అందించ‌నున్నారు.
(చదవండి : అభిశంసన: ట్రంప్‌ కన్నా ముందు ఎవరంటే)

అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. జో బైడెన్‌ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజధాని వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. ఈ  నెల 11 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎమర్జెన్సీ జనవరి 24వరకు కొనసాగుతుందని వైట్‌హౌజ్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు