షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్‌

9 Jul, 2022 12:13 IST|Sakshi

వాషింగ్టన్‌: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు జరపడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఈ క్రమంలో జపాన్‌ రాయబార కార్యాలయాన్ని సందర్శించి అబేకు సంతాపం తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. ఈ విషాద సంఘటనపై తన సానుభూతిని వ్యక్తం చేస్తూ.. జపాన్‌ అంబాసిడర్‌ కోజి టొమితాకు భావోద్వేగ నోట్‌ను అందజేశారు. షింజో అబే అంటే శాంతి, తీర్పు అంటూ అందులో రాసుకొచ్చారు బైడెన్‌. 

'షింజో అబే కుటుంబం, జపాన్‌ ప్రజలకు బైడన్‌ కుటుంబం, అమెరికా ప్రజల తరుపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. గతంలో ఉపాధ్యక్షుడి నివాసంలో ఆథిత్యమిచ్చినప్పుడు, జపాన్‌ పర్యటనలో ఆయనను కలుసుకోవటం నాకు గర్వకారణం. షింజో మరణం ఆయన భార్య, కుటుంబం, జపాన్‌ ప్రజలకు మాత్రమే లోటు కాదు.. యావత్‌ ప్రపంచానికి తీరని లోటు. శాంతి, సామరస్యానికి అబే ప్రతిరూపం.' అని పేర్కొన్నారు జో బైడెన్.

అంతకు ముందు.. దుండగుడి కాల్పుల్లో షింజో అబే మరణించారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధ్యక్షుడు బైడెన్‌. ఇది జపాన్‌ తోపాటు ఆయన గురించి తెలిసిన వారందరికీ ఓ విషాద సంఘటన అని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్‌ కోసం ఆయన విజన్‌ కొనసాగుతుందన్నారు. ఆయన జీవితాన్ని జపాన్‌ ప్రజలకు సేవ చేసేందుకే అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు