-

Johnson vaccine: అరుదైన నాడీ సమస్యలు: ఎఫ్‌డీఏ

13 Jul, 2021 11:36 IST|Sakshi

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు ఎదురుదెబ్బ

అరుదైన నాడీ గుల్లెయిన్-బార్ సిండ్రోమ్ :  యూఎస్‌ ఏఫ్‌డీఏ 

వాషింగ్టన్: అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కరోనా టీకాకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కరోనా టీకా పై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్  (ఎఫ్‌డీఏ) తాజాగా కీలక హెచ్చరికలు చేసింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి  అరుదైన న్యూరాలజీ సమస్యలు వస్తున్నాయని  సోమవారం ప్రకటించింది. దీనిపై 100 మంది నుంచి ఫిర్యాదులు అందుకున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో తెలిపింది.రానున్న సమావేశాల్లో దీన్ని సమీక్షించమని  సీడీసీ వ్యాక్సిన్ నిపుణుల ప్యానెల్‌ను కోరనుంది. అయితే దీనిపై  జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఇంకా  స్పందించలేదు.

ఎఫ్‌డీఏ  ప్రకారంటీకా తీసుకున్నవారిలో నరాల కణాలను దెబ్బతీయడం,కండరాల బలహీనత, ఒక్కోసారి పక్షవాతం వస్తుందని, దీన్నే గుల్లెయిన్-బార్-సిండ్రోమ్ అంటారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌  టీకా తీసుకున్న వారిలో 100 గుల్లెయిన్-బార్ అనుమానాస్పద కేసులను ఫెడరల్ అధికారులు గుర్తించారు. ఈ కేసులలో తొంభై ఐదు శాతం తీవ్రమైనవి పేర్కొంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని కూడా  ఎఫ్‌డీఏ తెలిపింది. అయితే ప్రమాద అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించి నప్పటికీ జాన్సన్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో టీకాలు  42 రోజులలో ఈ ప్రభావం  మూడు నుండి ఐదు రెట్లు అధికంగా ఉందని తెలిపింది. వ్యాక్సిన్ ప్రొవైడర్లు, టీకా తీసుకుంటున్న వారికి టీకా గురించి హెచ్చరికలఎటాచ్‌ మెంట్‌ద్వారా వివరిస్తోంది.

కాగా అమెరికా, లాటిన్‌ అమెరికా, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రయోగాల్లో జేఅండ్‌జే వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమైనది, సామర్థ్యమైనదని తేలింది. కరోనా వైరస్‌పై 85శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్‌ పని చేస్తుందని వివిధ ప్రయోగాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా వేరియెంట్‌పైన కూడా ఈ టీకా అద్భుతంగా పని చేస్తోందని ప్రాథమికంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీనిపై అమెరికా అధ్యకక్షుడు జోబైడెన్‌ ప్రశంసలు కురిపించారు. ఈ ఏడాది మార్చిలో దీనికి అక్కడ అత్యవసర వినియోగం కింద అనుమతి లభించింది. అమెరికాలో సుమారు 12.8 మిలియన్ల మంది పూర్తిగా టీకాలు తీసుకోగా , జనాభాలో 8 శాతం మంది - జాన్సన్ అండ్‌ జాన్సన్ షాట్ అందుకున్నారు. సుమారు  146 మిలియన్లకు ఫైజర్ లేదా మోడెర్నా  వ్యాక్సిన్లు తీసుకున్నారు. 
 

మరిన్ని వార్తలు