400 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అద్భుత ఘట్టం రేపే..

20 Dec, 2020 17:55 IST|Sakshi
నాసా ట్వీట్‌ చేసిన ఫొటో

న్యూయార్క్‌ : సోమవారం(రేపు) ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రెండు పెద్ద గ్రహాలైన శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోనికి రానున్నాయి. దీన్నే ‘క్రిస్మస్‌ స్టార్‌’ అని పిలుస్తారు. ఇది అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇక మళ్లీ 60 ఏళ్ల తర్వాతే ఇది జరుగుంది. అంటే 2080లో శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోకి వస్తారన్న మాట. ఇలాంటి ఘట్టం దాదాపు 400 ఏళ్ల తర్వాత చోటుచేసుకోబోతోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని, బృహస్పతి దగ్గరగా, ఒకే వరుసలోకి వచ్చే సంఘటన రాత్రి పూట జరిగి దాదాపు 800 ఏళ్లు అయిందని పేర్కొన్నారు. గెలీలియో టెలీస్కోప్‌ను కనిపెట్టిన 13 ఏళ్ల తర్వాత 1623లో ‘క్రిస్మస్‌ స్టార్‌’ ఆవిష్కృతం అయిందని అంటున్నారు.

మరిన్ని వార్తలు