పాము నవ్వింది.. ఈ వింత ఏంటో

ఇదేందయ్యా ఇది.. పాములు కూడా నవ్వుతాయా అనుకోకండి. ఫొటోలో చూశారు కదా.. తెల్లటి పాముపై బంగారు వర్ణంలో ఉన్న బొమ్మలు. అదేనండీ నవ్వుతో కూడిన ఎమోజీలు.. ఈ పాముపై ఇలాంటి ఎమోజీలు మూడు ఉన్నాయి. అంతే ఈ పాముకు భలే డిమాండ్‌ వచ్చింది. ఏకంగా ఇది రూ.4.3 లక్షలకు అమ్ముడుపోయింది. అమెరికాకు చెందిన జస్టిన్‌ కోబిల్కా పాములను పెంచడంలో సిద్ధహస్తుడు. తెల్లరంగు కొండచిలువలపై (బాల్‌ పైథాన్‌) బంగారురంగు వచ్చేలా ప్రయోగాలు చేయడం ఇతడికి చాలా ఇష్టమట. అందుకే 20 ఏళ్లుగా ఇలాంటి కొండ చిలువలను పెంచుతున్నాడు.


అయితే ఈ కొండచిలువపై ఇలా నవ్వుతున్న మూడు ఎమోజీలు మాత్రం అనుకోకుండా ఏర్పడ్డాయని, కాకతాళీయంగా వచ్చాయని, తనకు కూడా చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. సాధారణంగా తాను పెంచిన ప్రతి 20 పాములపై ఒక ఎమోజీ ఉండటం సాధారణమని, కాకపోతే మూడు ఎమోజీలు ఉండటం మాత్రం ఇదే తొలిసారని పేర్కొన్నాడు. జన్యు మార్పులు జరిగి, ఇలా పాము ఒంటిపై బంతుల ఆకారం వచ్చేలా చేస్తున్నాడు కోబిల్కా. ఈ బాల్‌ పైథాన్‌లు చాలా స్నేహంగా ఉంటాయని, మచ్చిక చేసుకోవడానికి సరైన పాములని చెబుతున్నాడు. వీటిని సులువుగా పెంచుకోవచ్చని పేర్కొంటున్నాడు.   
చదవండి:
ఒక గుడిసె.. 21 పాము పిల్లలు! 

Author: కె. రామచంద్రమూర్తి
Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు