సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో

30 Sep, 2023 05:41 IST|Sakshi

టొరంటో: ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారి, ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌తో సన్నిహిత సంబంధాలను మెరు గుపర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చెప్పారు. అదేసమయంలో, ఖలిస్తాన్‌ వేర్పాటువాది నిజ్జర్‌ హత్య ఘటనకు సంబంధించిన వాస్తవాల వెల్లడిలో సహకారానికి భారత్‌ ముందుకురావాలని కోరారు. భారత్‌పై బలమైన ఆరోపణలున్నప్పటికీ సన్నిహితంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. మాంట్రియల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘ప్రపంచ వేదికపై కీలకంగా మారిన భారత్‌తో కెనడా, మిత్ర దేశాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందని భావిస్తున్నా. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ అంతర్జాతీయ రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషిస్తోంది. అందుకే భారత్‌తో సన్నిహిత సంబంధాల కొనసాగింపునకు కట్టుబడి ఉన్నాం’అని చెప్పారు. అదే సమయంలో చట్టపాలన కలిగిన దేశంగా, నిజ్జర్‌ హత్యకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు భారత్‌ తమతో కలిసి పని చేయాలని భావిస్తున్నామన్నారు. భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో వాషింగ్టన్‌లో జరిగే సమావేశంలో ఇదే విషయాన్ని బ్లింకెన్‌ ప్రస్తావిస్తారని కూడా బైడెన్‌ ప్రభుత్వం చెప్పిందన్నారు.

మరిన్ని వార్తలు