దేశ మహిళలపై హిల్లరీ వ్యాఖ్యల ప్రభావం: కమల

15 Nov, 2020 13:13 IST|Sakshi

వాషింగ్టన్‌: కమలా హ్యారిస్‌... ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారత సంతతికి చెందిన ఆమె అమెరికా మొట్టమొదటి మహిళ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై అగ్రరాజ్యం చరిత్రను తిరగ రాశారు. వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్షుడు జో బైడెన్‌ క్యాబినెట్‌ ప్రమాణ స్వీకారం చేయనుంది. జో బైడెన్‌ అనుచురాలు కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హ్యారిస్‌ అమెరికా రాజకీయాలను మార్చే దిశగా మహిళ శక్తిని నడిపిస్తానంటూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. తాము ఎక్కువగా చిన్నారులకే ప్రాధ్యాన్యత ఇస్తామంటూ 2016 ఎలక్షన్‌లో డెమొక్రటిక్ పార్టీ‌  అభ్యర్థి  హిల్లరీ క్లింటన్‌ వ్యాఖ్యలను గుర్తు చేశారు. నాలుగేళ్ల క్రితం హిల్లరి తన వ్యాఖ్యలతో మహిళలను అమెరికా రాజకీయాలవైపు నడిపించారన్నారు. 2016లో డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా డెమొక్రటిక్‌ పార్టీ నుంచి హిల్లరి క్లింటన్‌ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు సాధించి అమెరికా అధ్యక్షడు అయ్యారు. (చదవండి: భారత మహిళలకు కమల ఆదర్శం)

కాగా హిల్లరి క్లింటన్‌ తన ఓటమి అనంతరం‌ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ‘నాకు తెలుసు మేము ఇక వైట్‌ హౌజ్‌ను చేరలేమని, కానీ ఏదో ఒకనాడు అనుకోని విధంగా త్వరలోనే మహిళలు వైట్‌ హౌజ్‌న ఏలుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. హిల్లరీ క్లింటన్‌ వ్యాఖ్యలు అమెరికా మహిళలపై ప్రభావం చూపిందని, అప్పటి నుంచి వారు అమెరికా రాజకీయ చరిత్రను మార్చే దిశ ప్రయాణించారని, దీనికి నేటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని కమలా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేగాక నేటి బాలలే రేపటి పౌరులుగా హిల్లరి వ్యాఖ్యానించారన్నారు. దేశంలోని చిన్నారులను ఉద్దేశిస్తూ ‘మీరు విలువైన వారు, శక్తవంతమైనవారు. మీ స్వంత కలలను కొనసాగించడానికి, సాధించడానికి ప్రపంచంలోని ప్రతి అవకాశానికి అర్హులేనన్న విషయాన్ని సందేహించకండి’ అని ఆమె పిల్లలకు సందేశం ఇచ్చారని హ్యారిస్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యాక్షురాలుగా ఎన్నికై దేశంలో వివక్షకు గురవుతున్న దక్షిణాసియా సంతతికి చెందిన మొట్టమొదటి వ్యక్తి అయ్యారు. (చదవండి: కమలా హారిస్‌ భర్త భావోద్వేగ పోస్టు!

>
మరిన్ని వార్తలు