కమలా హ్యారిస్‌ చేసిన కార్న్‌బ్రెడ్‌ రెసిపీ

25 Nov, 2020 11:16 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హ్యారిస్‌కు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా తన కుటుంబానికి ఎంతో ఇష్టమైన కార్న్‌బ్రెడ్‌ రెసిపీని సోషల్ ‌మీడియా ద్వారా షేర్ ‌చేశారు. ఎప్పుడైనా మూడ్‌ ఆఫ్‌గా ఉన్నప్పుడు వెంటనే కిచెన్‌లోకి వెళ్లిపోతానంటూ కమలా పేర్కొన్నారు. కార్న్‌బ్రెడ్‌ కి కావాల్సినవి..కార్న్‌బ్రెడ్‌ మిక్స్‌, సాసేజ్‌, ఉల్లిపాయలు, ఆపిల్‌, సెలెరీ కాండా, చికెన్‌, వెన్న, రోజ్‌మేరి, ఉప్పు, మిరియాలు. ఈ సింపుల్‌ పదార్థాలతో  కార్న్‌బ్రెడ్‌ డ్రెస్సింగ్ ఎలా తయారుచేయాలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు కమలా హ్యారిస్‌. దీన్ని థ్యాంక్స్‌ గివింగ్‌లో భాగంగా తన కుటుంబానికి వండి పెట్టేందుకు ఈ రెసిపీని ఎంచుకున్నట్లు ఆమె తెలిపారు. (కమలపై ప్రియాంక ట్వీట్‌: 50 ఏళ్ల కిందటే)

కార్న్‌బ్రెడ్‌ రెసిపీ లేకుండా థ్యాంక్స్‌ గివింగ్‌ భోజనం పూర్తి కాదని గతంలోనూ కమలా వెల్లడించారు. ఇక అమెరికాలో ఏటా నవంబర్‌ చివరి వారంలో థ్యాంక్స్‌ గివింగ్‌ జరుపుకుంటారు. రకరాకల వంటకాలతో కుటుంబం అంతా ఇకచోట చేరి ఆనందంగా మీల్స్‌ని ఎంజాయ్‌ చేస్తారు. అమెరికా మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఎన్నికైన సంగతి తెలిసిందే. డెమోక్రటిక్‌ పార్టీలో చేరి, వివిధ పదవుల్లో పనిచేసిన ఆమె జనవరి 20న అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. (అధికార మార్పిడికి ట్రంప్‌ గ్రీన్‌ సిగ్నల్‌ )

A post shared by Kamala Harris (@kamalaharris)

>
మరిన్ని వార్తలు