White House: జో బైడెన్‌ సంచలన నిర్ణయం

6 May, 2022 09:59 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్లజాతీయులకు కీలక పదవిని బైడెన్‌ అప్పగించారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ తదుపరి ప్రెస్‌ సెక్రటరీగా నల్లజాతీయురాలైన కరీన్‌ జీన్‌ పియర్‌(44)ను నియమిస్తున్నట్టు తెలిపారు. 

ఈ నేపథ్యంలో అమెరికాలో అత్యున్నత స్థాయిలో కీలక పదవిని చేపట్టనున్న మొదటి నల్లజాతి వ్యక్తిగా ఆమె రికార్డుల్లో నిలిచారు. ఇదిలా ఉండగా.. కరీన్‌ జీన్‌ పియర్‌ LGBTQ+ వ్యక్తి(LGBTQ+.. లెస్బియన్‌, గే, bisexual, ట్రాన్స్‌జెండర్‌) కావడం విశేషం. ఆ పదవిలో LGBTQ+ వ్యక్తి ఉండటం కూడా ఇదే మొదటిసారి. కాగా, జీన్‌ పియర్‌ వైట్‌ హౌస్‌లో చేరడానికి ముందు ఎన్నికల సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు బైడన్‌ తరఫున ప్రచారం నిర్వహించారు.

మరోవైపు.. ప్రస్తుతం వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీగా పని చేస్తున్న జెన్‌ పాకి పదవీకాలం ఈనెల 13వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమె స్థానంలో జీన్‌ పియర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, ఉక్రెయిన్‌తో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ జెన్‌ పాకీ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ర‌ష్యా చ‌మురును డిస్కౌంట్‌లో ఇండియా కొన‌డం ఆంక్ష‌ల ఉల్లంఘ‌న కాదు అని, కానీ అలాంటి చ‌ర్య చేప‌డితే అప్పుడు చ‌రిత్ర‌లో భార‌త్ ఓ త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా భావించాల్సి వ‌స్తుంద‌ని ఆమె అన్నారు. 

ఇది కూడా చదవండి: క్షమాపణలు చెప్పిన వ్లాదిమిర్‌ పుతిన్‌

మరిన్ని వార్తలు