Cheetah Brothers: భయం వీడాయి.. ఒక్కటై దూకాయి

2 Sep, 2021 14:36 IST|Sakshi

2020 జనవరి.. కెన్యాలోని మాసాయ్‌ మారా నేషనల్‌ రిజర్వులో ఒకటే కుండపోత. తాలేక్‌ నది అయితే.. ఉగ్రరూపం దాల్చింది.. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో పోటెత్తింది..  అలాంటి టైంలో ఒడ్డుకు అటు వైపున ఐదు చీతాలు.. ఆదుర్దాగా అటూ ఇటూ తిరుగుతున్నాయి.. ఎందుకంటే.. ఈ నదిని దాటాలనుకుని ప్రయత్నించిన జంతువులను.. అయితే వరద మింగేస్తుంది.. లేదా నదిలోని భయంకరమైన మొసళ్లు మింగేస్తాయి.. కానీ ఎలాగైనా నదిని దాటాలి.. ఎందుకంటే.. ఒడ్డుకు ఆవల వాటి రాజ్యముంది.. ఆ ఐదుగురు స్నేహితులు పాలించే సామ్రాజ్యముంది.. భయం వీడాయి.. ఒక్కటై దూకాయి.. వరద ఉధృతిని తట్టుకున్నాయి.. కలిసికట్టుగా నదిని దాటాయి..  

ఈ చీతాల సాహసకృత్యాన్ని బుద్దిలినీ డిసౌజా అనే ఫొటోగ్రాఫర్‌ క్లిక్‌మనిపించారు. ఈ చీతాలు లోకల్‌గా ఫేమస్‌ అని.. ప్రపంచంలో ఎక్కడా ఇలా ఐదు మగ చీతాలు ఫ్రెండ్స్‌గా లేదా గుంపుగా కలిసిలేవని డిసౌజా తెలిపారు.  ‘గ్రేట్‌ స్విమ్‌’ పేరిట డిసౌజా తీసిన ఈ చిత్రం ప్రఖ్యాత ‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పోటీలో తుది జాబితాకు ఎంపికైంది..  విభాగాలవారీగా విజేతల వివరాలను ఆక్టోబర్‌ 12న ప్రకటిస్తారు.

మరిన్ని వార్తలు