సీసీటీవీ కెమెరాలో రికార్డయైన ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య 

26 Sep, 2023 20:42 IST|Sakshi

ఒట్టావా: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్-కెనడా మధ్య వివాదానికి కారణమైంది. ఈ హత్య వెనుక భారత్ హస్తముందని ఆ దేశ ప్రధాని ఆరోపించాక రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా ఈ కేసు విచారణలో భాగంగా హర్దీప్ సింగ్ హత్యకు సంబంధించిన వీడియో ఒకటి బయటపడింది. వీడియోలో ఈ వీడియోకు సంబంధించి ప్రముఖ పత్రిక ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. 

ఈ ఏడాది జూన్ 18న కెనడాలో బ్రిటీష్ ప్రావిన్స్‌లోని సర్రే గురుద్వారా ఎదురుగా నిజ్జర్ హత్య జరిగింది. విచారణలో భాగంగా పోలీసులు అక్కడి గురుద్వారా సీసీ కెమెరాల్లో నిజ్జర్ హత్య తాలూకు దృశ్యాలు రికార్డయ్యాయి. 90 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ముఖానికి మాస్కులు ధరించిన ఆరుగురు దుండగులు రెండు వాహనాలపై వచ్చి నిజ్జర్‌పై కాల్పులు జరిపారని ఆ పత్రికా కథనంలో పేర్కొంది. దుండగులు మొత్తం 50 రౌండ్లు కాల్పులు జరపగా అందులో 34 నిజ్జర్ శరీరంలో దూసుకెళ్లాయని తెలిపింది. 

నిజ్జర్‌ హత్యను ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపిన వివరాలతోపాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. భూపేందర్ సింగ్ అనే వాలంటీర్ అక్కడ ఆ సమయంలో ఫుట్ బాల్ ఆడుకుంటున్నానని కాల్పుల శబ్దం విని ఏవో టపాసులు అనుకున్నానని తెలిపాడు. వెంటనే పార్కింగ్ వద్దకు వెళ్లి చూస్తే నిజ్జర్ ట్రక్ అద్దాలు మొత్తం రక్తసిక్తమై ఉన్నాయని తెలిపాడు. తనతోపాటు మరికొందరు స్నేహితులు కారు డోర్ తెరిచి చూస్తే అప్పటికే నిజ్జర్ చనిపోయాడన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు మాస్కులు ధరించి హుడీలు ధరించి ఉన్నారని తెలిపాడు.            
 
ఇది కూడా చదవండి: భారత్‌తో సైనిక సంబంధాలకు ఢోకా లేదు: కెనడా సైనికాధికారి

మరిన్ని వార్తలు