‘నా కొడుకుని మీ నీచ రాజకీయాలకు దూరంగా ఉంచండి’

5 May, 2022 21:23 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటన సందర్భంగా బెర్లిన్‌లో ఏడేళ్ల కుర్రాడు దేశభక్తి గీతాన్ని ఆలపించిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించిన ఎడిట్‌ వీడియ కమెడీయన్‌ కునాల్‌ కుమ్రా షేర్‌ చేశాడు. దీంతో కుర్రాడి తండ్రి గణేష్‌ పౌల్‌ కుమ్రా పై మండిపడుతూ ఓ ట్వీట్‌ని షేర్‌ చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా 2010లో వచ్చి పిప్లీలైవ్‌ సినిమాలోని ‘హే జన్మభూమి భారత్‌’,  మెహెంగయి దాయన్‌ ఖాయే జాత్‌ హై పాటను ఏడేళ్ల  కుర్రాడు పాడారు.

దీనికి సంబంధించిన ఎడిట్‌ వీడియో బయటకు రావడంతో ఆ కుర్రాడి తండ్రి గణేష్‌ పౌల్‌పై షేర్‌ చేసిన హస్యనటుడు కునాల్‌ కుమ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బదులుగా గణేష్‌ పౌల్‌ ట్విట్టర్‌లో స్పందిస్తు ఏడేళ్ల వయసున్న నాబిడ్డ  మాతృభూమి కోసం పాట పాడారని, ఇప్పటికి భారతదేశాన్ని మీ అందరి కంటే తన కొడుకు ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు తెలిపారు. మిస్టర్‌ కుమ్రా లాంటి వాళ్లు ఏమనుకున్నా ఫర్వాలేదన్నారు. తన కుమారుడిని నీచ రాజకీయాలకు దూరంగా ఉంచి మీ జోకులకు పని చెప్పుకోండంటూ ఫైర్‌ అయ్యారు. 
 

చదవండి: పెళ్లి రోజు వరుడు సర్‌ప్రైజ్‌.. గిఫ్ట్‌ చూసి ఏడ్చేసిన వధువు!

మరిన్ని వార్తలు