అమెరికా మా ప్రధాన శత్రువు: కిమ్‌ జాంగ్‌‌ ఉన్‌

15 Jan, 2021 10:33 IST|Sakshi

ట్రంప్‌ పదవి కాలం ముగుస్తుండటంతో కిమ్‌ దూకుడు

సబ్‌మెరైన్‌ లాంచ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ని ఆవిష్కరించిన కిమ్‌

ప్యోంగ్యాంగ్‌: మరికొద్ది రోజుల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ పదవి కాలం ముగియనుండటంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్ దుందుడుకు చర్యలకు దిగారు. తాజాగా రాజధాని ప్యోంగ్యాంగ్‌లోని కిమ్ ఇల్ సుంగ్ స్క్వేర్‌లో గురువారం జరిగిన సైనిక కవాతులో కిమ్‌ జాంగ్‌ ఉన్న కొత్త సబ్‌మెరైన్‌ లాంచ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ని (ఎస్‌ఎల్‌బీఎం) ఆవిష్కరించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. పాలక వర్గం వర్కర్స్ పార్టీ కాంగ్రెస్‌ సమావేశాల సందర్భంగా ఈ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్‌ అమెరికాను తన దేశ ప్రధాన శత్రువుగా ప్రకటించారు. ఇక నూతనంగా ఆవిష్కరించిన సబ్‌మెరైన్‌ లాంచ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రదర్శనని కిమ్‌ పర్యవేక్షించారు. ఇక దీనిలో "భూభాగం వెలుపల ముందస్తుగా శత్రువులను గుర్తించి పూర్తిగా నాశనం చేసే శక్తివంతమైన అద్భుతమైన సామర్ధ్యం కలిగిన రాకెట్లు" ఉన్నాయని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. కొరియా ద్వీపకల్పానికి అవతల పరిధిలో ఉన్న టార్గెట్‌లని కూడా ఈ రాకెట్లు నాశనం చేస్తాయని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది.

కవాతులో సైనికుల వరుసలు, మిలిటరీకి చెందిన ట్యాంకులు, రాకెట్ లాంచర్‌లు ఉన్నాయి. వీటికి చివర్లో, విశ్లేషకులు అభిప్రాయపడుతున్న కొత్త రకం స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల కనిపించాయి. "ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం సబ్‌మెరైన్‌ లాంచ్‌ బాలిస్టిక్ క్షిపణి. ఒకదాని తరువాత ఒకటి స్వ్కేర్‌లోకి ప్రవేశించి, విప్లవాత్మక సాయుధ దళాల శక్తిని శక్తివంతంగా ప్రదర్శిస్తుంది" అని అధికారిక కేసీఎన్‌ఏ వార్తా సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా నీటి అడుగున నుంచి అనేక ఎస్‌ఎల్‌బీఎంలను పరీక్షించింది. ఇక ప్రస్తుతం ఉత్తర కొరియా క్షిపణులను మోయడానికి కార్యాచరణ జలాంతర్గామిని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: ‘చైనా’ నుంచి ఎల్లోడస్ట్‌; ఉ. కొరియా వార్నింగ్‌!)

జాతీయ మీడియా విడుదల చేసిన ఫోటోల్లో ఎస్‌ఎల్‌బిఎమ్‌ను పుక్‌గుక్సాంగ్-5 అనే లేబుల్‌ ఉంది. ఇది అక్టోబర్‌లో నిర్వహించిన సైనిక కవాతులో ఆవిష్కరించబడిన పుక్‌గుక్సాంగ్-4 కు అప్‌డేటెడ్‌ వర్షన్‌గా భావిస్తున్నారు. అక్టోబర్ పరేడ్ మాదిరిగా కాకుండా, గురువారం నిర్వహించిన పరేడ్‌లో ఉత్తర కొరియా తన అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ఐసీబీఎంలు) ప్రదర్శించలేదు. ఇది అమెరికాలో ఎక్కడైనా అణు వార్‌హెడ్‌ను అందించగలవని నమ్ముతారు. నిషేధించబడిన అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల నిర్వహణ వల్ల ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి: భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా)

ఇదేకాక ప్రస్తుతం ఈ దేశం ఇంకా లాక్‌డౌన్‌లోనే ఉంది. గత జనవరిలో పొరుగున ఉన్న చైనాలో మొదట ఉద్భవించిన కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ఉత్తర కొరియా దాని సరిహద్దులను మూసివేసింది. ఈ చర్యలు ఇప్పటికే కుంటుపడిన ఆర్థిక వ్యవస్థని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక వాషింగ్టన్‌లో నాయకత్వ మార్పు ఉ‍త్తరకొరియాకు సవాలుగా మారనుంది. బైడెన్.. ఒబామా పరిపాలన కాలంలో అనుసరించిన "వ్యూహాత్మక సహనం" విధానంతో సంబంధం కలిగి ఉన్నాడు. అలానే అధ్యక్ష చర్చల సందర్భంగా బైడెన్‌, కిమ్‌ను "దుండగుడు" గా వర్ణించాడు. బైడెన్ ఆధ్వర్యంలో మరింత సనాతన దౌత్య విధానాలకు అమెరికా తిరిగి వస్తుందని భావిస్తున్నారు. ఇవన్ని ఉత్తర కొరియాకు ఇబ్బందిగా మారనున్నాయి. 
 

మరిన్ని వార్తలు