యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌పై కిమ్‌ సోదరి ఫైర్‌

22 Nov, 2022 19:12 IST|Sakshi

ఇటీవల ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలతో సహా ఐక్యరాజ్యసమతి సెక్యూరిటీ కౌన్సిల్‌ సైతం ఉత్తర కొరియా తీరుపై మండిపడింది. ఉత్తర కొరియా దూకుడుకి అడ్డుకట్టే వేసే దిశగా పావులు కదిపింది కూడా. ఈ నేపథ్యంలో యూఎన్‌ఎస్‌సీ తీసుకున్న విధానాలను విమర్శిస్తూ...ఇది ద్వంద వైఖరి అంటూ కిమ్‌జోంగ్‌ ఉన్‌ సోదరి యో జోంగ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌పై నిప్పులు చెరిగింది.

దక్షిణకొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ప్రమాదకరమైన సైనిక కసరత్తుల విషయంలో యూఎస్‌ఎస్‌సీ కళ్లు మూసుకుపోయినట్లు ఉన్నాయి అంటూ కస్సుమంది. అత్యాశతో ఆయుధాల పెంచుకునే దిశగా చేసిన కసరత్తులు సెక్యూరిటీ కౌన్సిల్‌కి కనిపంచటం లేదని అన్నారు. భయంతో మొరిగే కుక్కమ మాదిరిగా అమెరికా ప్రవర్తిస్తుందని కిమ్‌ సోదరి యో జోంగ్‌ అన్నారు.  కేవలం కొరియా ద్వీపకల్పాన్ని సంక్షోభంలోకి నెట్టివేయడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా ఇలా చేస్తుందని నిందించారు. కిమ్‌జోంగ్‌ ఉన్‌ ఇటీవలే హ్యాసాంగ్‌-17 అనే క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసింది.

దీన్ని రాక్షస క్షిపణిగా దక్షిణ కొరియా పేర్కొంది. ఈ క్షిపణి 6 వేల కి.మీ ఎత్తులో వెయ్యి కిలోమీటర్లు (620 మైళ్ళు) వరకు దూసుకుపోయిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తరకొరియా మార్చి 24న అత్యంత శక్తివంతమైన అణు పరీక్షల్లో ఒకటైనా ఐసీబీఎం కంటే ఈ క్షిపణి ప్రయోగం కొంచెం తక్కువగా ప్రభావంతమైందని తెలిపింది.

అదీగాక ఇంతవరకు ఉత్తరకొరియా ప్రయోగించిన రికార్డు బ్రేకింగ్‌ క్షిపణుల్లో ఇది సరికొత్తది. అంతేగాదు దక్షిణ కొరియాలను, టోక్యోలను రక్షించడానికి వాషింగ్టన్‌ తీసుకుంటున్న చర్యలపై ఉత్తరకొరియా, రష్యాలు పదే పదే నిప్పులు గక్కాయి. దక్షిణ కొరియా, అమెరికాలోని విశ్లేషకులు, అధికారులు మాత్రం ఉత్తర కొరియా ఏడవ అణు పరీక్షకి సిద్ధం కానుందని హెచ్చరిస్తున్నారు.

(చదవండి: ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత, జపాన్‌, సౌత్‌ కొరియా అలర్ట్‌)
 

>
మరిన్ని వార్తలు