ఫేస్‌బుక్‌కు దూరంగా ప్రముఖులు, కారణం?

16 Sep, 2020 10:34 IST|Sakshi

న్యూయర్క్‌: ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లపై ద్వేష పూరిత ప్రచారాలు, తప్పుడు సమాచారాలపై చర్యలు తీసుకోవాలంటూ రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. ఈ నిరసనలో భాగంగా కిమ్ కర్దషియన్‌తో సహా ప్రముఖులు 24 గంటల నుంచి  ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఎలాంటి పోస్ట్ చేయలేదు. లియోనార్డో డికాప్రియో, సాచా బారన్ కోహెన్, కాటి పెర్రీ,  మైఖేల్ బి. జోర్డాన్ వంటి స్టార్స్ అందరూ ‘స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్‌’ నిర్వహిస్తున్న నిరసనకు మద్దతు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో మార్పు కోసం పిలుపునిచ్చారు. ‘ఈ వేదికలు ద్వేషం, తప్పుడు సమాచారం వ్యాప్తిని అనుమతించేటప్పుడు నేను కూర్చుని మౌనంగా ఉండలేను - అమెరికాను విభజించడానికి గ్రూపులను సృష్టించాయి’ అని  కర్దషియాన్‌ తెలిపారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 188 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. 

అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 2016 అమెరికా ఎన్నికల సమయంలోనూ రష్యా ప్రచారం చేసిన వార్తలను ఫేస్‌బుక్‌ అరికట్టలేకపోయిందని అనేక ఆరోపణలు ఎదుర్కోంది. సెలబ్రెటీలతో పాటు అనేక సంస్థలు కూడా యాడ్స్‌ను ఆపేసి ఫేస్‌బుక్‌ మీద నిరసనలు వ్యక్తం చేశాయి. అయిన ఫేస్‌బుక్‌ ఆదాయం 5.2 బిలియన్‌ డాలర్ల విలువైన యాడ్‌ రెవెన్యూ వచ్చింది. తప్పుడు వార్తలు, ప్రచారాలపై చర్యలు తీసుకుంటామని సోషల్‌ మీడియా చెబుతూ, అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్న ఇంకా అలాంటి వార్తలను కట్టడిచేయలేకపోతుంది.   చదవండి: చిన్న సంస్థలకు ఫేస్‌బుక్‌ రూ. 32 కోట్ల గ్రాంటు 

మరిన్ని వార్తలు