ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచేలా... రష్యా వ్యూహం

29 Aug, 2022 16:53 IST|Sakshi

Kremlin called for "pressure" on Kyiv: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచి జపోరిజ్జియాలో ఉ‍న్న అణుకర్మాగారంపై రష్యా దాడి చేస్తుందంటూ ఉక్రెయిన్‌ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. దీని వల్ల యూరప్‌ దేశాలకు అత్యంత ప్రమాదమని చెర్నోబిల్‌ అణుప్రమాదం లాంటిది మరొక విపత్తు ముంచుకొస్తుందని హెచ్చరిచ్చింది కూడా. రష్యా దూకుడుకి అడ్డుకట్టవేయమని పశ్చిమ దేశాలను కోరింది.

ఐతే రష్యా తాము అణుకర్మాగారంపై దాడుల జరపలేదని వాదించింది. కేవలం తాము ఆ ప్రాంతాన్ని అధినంలోకి తెచ్చుకున్నాం అని నొక్కి చెప్పింది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మాత్రం రష్యా అణు కర్మాగారంపై క్షిపిణి దాడులు చేస్తుందని, అందుకే ఆ కర్మాగారాన్ని మూసేశామని చెప్పారు. పైగా కర్మాగారం చాలావరకు దెబ్బతిందని ఇక ఏ క్షణమైన రేడియోషన్స్‌ లీకవుతాయంటూ యూరప్‌ దేశాలను హెచ్చరించారు జెలెన్‌స్కీ.  రష్యా కూడా ఆయా వ్యాఖ్యలన్నింటిని ఖండిస్తూ వచ్చింది.

ఈ విషయం పై ఇరు దేశాలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. దీంతో ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్‌ రాఫెల్‌ గ్రోస్సీ తాను స్వయంగా ఆ ప్లాంట్‌ని పర్యవేక్షించడానికి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ తాము చాలాకాలంగా దీని కోసమే ఎదురుచూస్తున్నాం అని  పేర్కొన్నారు.

దీంతో ఇప్పుడు ఉక్రెయిన్‌పై ప్రపంచ దేశాల నుంచి మరింత ఒత్తిడి పెరగుతుందన్నారు. యూరోపియన్‌ ఖండాన్ని ప్రమాదంలోకి నెట్టేయకుండా అన్ని దేశాలు ఉక్రెయిన్‌ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. తాము కూడా ఈ అణు కర్మాగారం ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గేలా కీవ్‌ పై ఒత్తిడి పెంచేందుకు పిలుపునిస్తున్నాం అని చెప్పారు. రాఫెల్‌ గ్రోస్సీ పర్యటనతో ఐఏఈఏ మాస్కో నియంత్రిత భూభాగాల్లో భద్రతను నిర్ధారించడమే కాకుండా ప్రబలంగా ఉన్న నష్టాలను కూడా పరిగణలోని తీసుకుంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు