నేడు భారత్‌-చైనా సైనిక కమాండర్ల కీలక సమావేశం

9 Apr, 2021 09:11 IST|Sakshi

కీలకం కానున్న నేటి కోర్‌ కమాండర్‌ స్థాయి అధికారుల సమావేశం

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో శాంతే లక్ష్యంగా నేడు 11వ విడత కోర్‌ కమాండర్ల సమావేశం జరగనుంది. తూర్పు లడ్డాఖ్‌ చుషుల్‌ ప్రాంతంలోని భారత్‌ శిబిరం వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పలుమార్లు భారత్‌-చైనా మధ్య సైనిక, దౌత్య చర్చలు అవి అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేదనే చెప్పాలి. లడ్డాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరణ తర్వాత జరుగుతున్నఈ భేటీ కీలకం కానుంది.

గతేడాది మే నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ఎల్‌వోసీ వెంబడి ఇరుదేశాలు భారీగా తమ సైన్యాన్ని మోహరించాయి. ఈ సందర్భంగా లడ్డాఖ్‌లోని గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌, డెప్పాంగ్‌ మైదానాల నుంచి కూడా బలగాలను ఉపసంహరించుకునే అంశంపై అధికారులు చర్చించనున్నారు.  ఈ నేపథ్యంలో నేడు జరగనున్న కోర్‌ కమాండర్‌ స్థాయి అధికారుల సమావేశం కీలకమనే చెప్పాలి.

( చదవండి: తారస్థాయికి ఉద్రిక్తతలు: చైనా కీలక వ్యాఖ్యలు )

మరిన్ని వార్తలు