లేడీ గాగా..జెన్నిఫర్‌ లోపెజ్‌..!

16 Jan, 2021 04:41 IST|Sakshi

బైడెన్‌ ప్రమాణ స్వీకారంలో స్టార్ల ప్రదర్శనలు

అంగరంగ వైభవంగా కార్యక్రమాల రూపకల్పన

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈనెల 20వ తేదీన జో బైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్‌ లోపెజ్, లేడీ గాగా వంటి పలువురు ప్రముఖ పాప్‌ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అమెరికాలో కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడిగా జో బైడెన్‌(78), ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌(56) వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనం వెస్ట్‌ఫ్రంట్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చాలా కొద్ది మాత్రమే హాజరుకానున్నారు. పలు కార్యక్రమాలు వర్చువల్‌గానే ఉంటాయి. క్యాపిటల్‌ హిల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడి, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో 10వేల మంది నేషనల్‌ గార్డులను వాషింగ్టన్‌లో పహారాకు నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే పరేడ్‌ కూడా వర్చువల్‌గానే ఉంటుందని ప్రమాణ స్వీకార కమిటీ ప్రకటించింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు