ఇండోనేషియాలో మరో ప్రమాదం

10 Jan, 2021 21:10 IST|Sakshi

జకర్తా: ఇండోనేషినియా పశ్చిమ జావాలోని సుమెడాంగ్ రీజెన్సీలో శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోగా.. 18 మంది గాయపడినట్లు  అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయని నేషనల్ ఏజెన్సీ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (బీఎన్‌పీబీ) అధికారి ఒకరు తెలిపారు. మొదట కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఖాళీ చేయిస్తున్న సమయంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. మృతుల్లో సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ వర్కర్లు ఉన్నారని చెప్పారు. సైనికులు, పోలీసులు, స్థానిక విపత్తు నిర్వహణ ఏజెన్సీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయయి. శనివారం గరుట్, సుమేడాంగ్‌తో సహా పశ్చిమ జావాలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి.

మరిన్ని వార్తలు