హెచ్‌1బీ కొత్త విధానంతో అమెరికాకే నష్టం

21 Oct, 2020 07:39 IST|Sakshi

హెచ్‌1బీ : ట్రంప్ సర్కారుకు మరో సవాల్!

ట్రంప్‌ నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేసిన పలు సంస్థలు

వాషింగ్టన్‌: హెచ్‌1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థకి కీడు చేస్తుందని అక్కడి పలు సంస్థలు అభిప్రాయపడ్డాయి. కొత్త వీసా విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అమెరికా చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మాన్యుఫాక్చర్స్‌తో సహా 17 వరకు సంస్థలు న్యాయస్థానంలో ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఉత్తర కొలంబియా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ కొత్త విధానం వల్ల నైపుణ్యం కలిగిన వారు దేశానికి రారని, అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి ఈ వీసా విధానం అవరోధంగా మారుతోందని వారు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్)

అమెరికా ఫస్ట్‌ అన్న నినాదాన్ని ముందుకు తీసుకువెళుతున్న ట్రంప్‌ ఈ నెల మొదట్లో హెచ్‌1బీ వీసా కార్యక్రమంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అమెరికన్‌ వర్కర్లకి అధికంగా ఉద్యోగాలు లభించేలా, అత్యధిక స్కిల్‌ ఉన్న విదేశీ నిపుణులకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభించేలా ఈ వీసా విధానంలో మార్పులు చేశారు. దీనిని సవాల్‌ చేసిన వారిలో ఆర్థిక, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. కొత్త వీసా విధానం అమెరికాలోని ప్రతీ రంగంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు