నిరసనలు: లెబనాన్‌ ప్రధాని రాజీనామా

11 Aug, 2020 15:33 IST|Sakshi

బీరుట్‌: లెబనాన్‌ ప్రధాని హసన్‌ దియాబ్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్‌ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. దాంతో రాజీనామా చేయాలని ప్రధాని హసన్‌ నిర్ణయించుకున్నారు. ‘ఇక్కడ ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని తేలింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై ప్రజలతో కలిసి మార్పుకోసం పోరాడుతానన్నారు. ఈ రోజు నా ప్రభుత్వం రాజీనామా చేస్తోంది. లెబనాన్‌ను దేవుడే రక్షించు గాక’ అని టీవీలో తన సంక్షిప్త ప్రసంగాన్ని ముగించారు. 
(చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్‌ బంక్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు