ముక్కులో ఇరుక్కున్న చెయ్యి: రెండేళ్ల తర్వాత..

19 Aug, 2020 15:36 IST|Sakshi
తండ్రితో సమీర్‌ అన్వర్‌

న్యూజిలాండ్‌ : పొరపాటున ఓ బాలుడి ముక్కులో ఇరుక్కుపోయిన ఓ బొమ్మకు సంబంధించిన చెయ్యి రెండు సంవత్సరాల తర్వాత బయటపడింది. ఈ సంఘటన న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. 2018లో డునెడిన్‌కు చెందిన సమీర్‌ అన్వర్‌ అనే పిల్లాడు లీగో గేమ్‌ ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత లీగో బొమ్మకు చెందిన చెయ్యి పొరపాటున అతడి ముక్కులో ఇరుక్కుపోయింది. పిల్లాడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు ముక్కును పరిశీలించినప్పటికి అక్కడ ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత వైద్యున్ని సంప్రదించినప్పటికి లాభం లేకపోయింది. (వైరల్‌: టాయిలెట్‌లోకి పాము ఎలా వచ్చింది!)

లీగో చెయ్యిని చూపెడుతున్న సమీర్‌, (ఇన్‌సెట్‌లో) లీగో బొమ్మ

ముక్కులో ఏమీ లేదని, ఏదైనా ఉంటే అది పొట్టలోకి పోయి బయటకు వచ్చేస్తుందని ఆ వైద్యుడు సమీర్‌ తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ తర్వాత కుటుంబంతో పాటు సమీర్‌ కూడా దాని గురించి మర్చిపోయాడు. అయితే కొన్ని రోజుల క్రితం సమీర్‌ తల్లి అతడి కోసం కప్‌ కేక్‌ తయారు చేసింది. కేక్‌ను ఆస్వాదించటానికి సమీర్‌ గట్టిగా వాసన చూశాడు. దీంతో అతడి ముక్కులో నొప్పి పుట్టింది. ఇదే విషయాన్ని తల్లికి చెప్పాడతను. ఆమె సలహా మేరకు గట్టిగా ఛీదడంతో ముక్కు లోపలినుంచి లీగో ముక్క బయటపడింది.

మరిన్ని వార్తలు