వైరల్‌: చిరుత ఇంతలా భయపడ్డం చూసుండరు

21 Nov, 2020 20:44 IST|Sakshi

కేప్‌టౌన్‌ : చిరుతపులి భయంతో పరుగులు పెట్టిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని గిల్లియన్‌ సోమామెస్‌, లింపోపో ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇది పాత వీడియో అయినప్పటికి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ వీడియోలో.. దాహంతో ఉన్న ఓ చిరుతపులి నీటి కుంట దగ్గరకు నీళ్లు తాగటానికి వచ్చింది. చుట్టూ చూసుకుంటూ నీళ్లు తాగుతోంది. చీకటిగా ఉన్న ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు ఫ్లాష్‌లాగా వెలుతురు వచ్చిపోతోంది. ( అది ఫేక్‌ వీడియో: కేసులు పెడతాం!)

అదే సమయంలో వెనకాల మరో చిరుత అక్కడికి వచ్చింది. వెనకాల ఉన్న పులి చప్పుడు.. ఫ్లాష్‌ లైట్‌ వెలుతురు.. నీళ్లు తాగుతున్న చిరుత ఒక్కసారిగా భయానికి గురైంది. కొన్ని అడుగులు పైకి ఎగిరి అక్కడినుంచి పరుగులు తీసింది. వెనకాల ఉన్న చిరుత కూడా ఏం జరుగుతోందో అర్థం కాక అక్కడినుంచి పారిపోయింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు