Dr. Zemmar: చనిపోతున్నప్పుడు మన మెదడు ఏం ఆలోచిస్తుందో తెలుసా!

24 Feb, 2022 21:35 IST|Sakshi

Last Recall Of Memories That we Have Experienced In Life: ఇంతవరకు శాస్త్రవేత్త పలు ఆవిష్కరణలతో వైజ్ఞానిక శాస్త్రాన్ని కొత్తపుంతలు తొక్కించారు. వైద్యా శాస్త్రానికి సాంకేతికతను జోడించి సాధ్యం కావు అనుకునే వాటన్నింటిని సాధ్యం చేయడమే కాక. సామాన్య మానవుడికి సైతం​ గొప్ప ఆధునికతతో కూడాని వైద్యం అందేలా చేశారు. ఇన్ని పరిశోధనలు చేసినప్పటికీ శాస్త్రవేత్తల బుర్రలను తొలిచేస్తున్న ఒకే ఒక్క విషయం మరణం. మరణించే ముందు మనలో ఏం జరుగుతుంది ఆ తర్వాత ఎక్కడి వెళ్తారు అనే అంతుబట్టని చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరికాయంటున్నారు శాస్త్రవేత్తలు.

వివరాల్లోకెళ్తే...చనిపోవడానికి ముందు మన జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలను చివరిగా గుర్తుచేసుకుంటుందని డాక్టర్ జెమ్మార్ చెబుతున్నారు. ఈ మేరకు చనిపోతున్నప్పుడు  మెదడు ఆలోచనలను రికార్డు చేయడంతో శాస్తవేత్తలకు మానవ మెదడును మరింత అర్థం చేసుకునే దిశగా అడుగులు వేయగలిగామని చెప్పారు. ఈ రికార్డింగ్‌ ప్రమాదవశాత్తు జరిగిందని తెలిపారు. ఈ మేరకు న్యూరో సైంటిస్టులు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న  87 ఏళ్ల రోగి మెదడు తరంగాలపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు.

అయితే ఆ సమయంలో ఆ రోగి గుండె పోటుకు గురై చనిపోతుతన్నప్పుడు అతని మెదడు ఊహించని విధమైన సంకేతాలను అందించింది. మనిషి చివరి సమయంలో రికార్డింగ్ మెమరీ రిట్రీవల్ ఊహించని మెదడు కార్యకలాపాలను వెల్లడించిందన్నారు. అవి తన జీవితపు తాలుకా జ్ఞాపకాలైన అయి ఉండవచ్చని చెప్పారు.   రోగి మెదడు ఆలోచనలు గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత 30 సెకన్ల పాటు కొనసాగిందని తెలిపారు.

అంతేకాదు గుండె పనిచేయడం ఆగిపోయే ముందు నాడీ డోలనాల్లో మార్పులను చూశామన్నారు. జ్ఞాపకశక్తి పునరుద్ధరణలో ప్రమేయం ఉన్న డోలనాలను ఉత్పత్తి చేయడం ద్వారా, మెదడు మనం చనిపోయే ముందు ముఖ్యమైన జీవిత సంఘటనల చివరి రీకాల్‌ను ప్లే చేస్తుందని ఇది మరణానికి సమీపంలో నివేదించబడిన అనుభవాల మాదిరిగానే ఉంటుందని డాక్టర్ జెమ్మార్ వెల్లడించారు. ఈ పరిశోధనలు ఖచ్చితంగా జీవితం ఎప్పుడు ముగుస్తుంది, అవయవ దానం చేసే సమయానికి ఏం జరుగుతుంది తదుపరి ప్రశ్నలకు సంబంధించిన అవగాహనను సవాలు చేస్తాయంటున్నారు వైద్యులు.

(చదవండి: న్యాయవాది వింత ప్రవర్తన..రక్తాన్ని​ ఇంజెక్ట్‌ చేసి, సిరంజీలతో దాడి చేసి..చివరికి)

మరిన్ని వార్తలు