రైతుల నిరసనకు లిల్లి సింగ్‌ మద్దతు

15 Mar, 2021 12:17 IST|Sakshi

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు కొంతమంది అంతర్జాతీయ ప్రముఖలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మరో ప్రముఖ వ్యక్తి చేరారు. ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 63వ గ్రామీ అవార్డు వేడకల్లో ప్రముఖ కెనడీయన్‌ యూట్యూబర్‌ లిల్లి సింగ్‌.. భారత్‌లోని రైతులకు మద్దతుగా ఉంటానని సూచించే ఓ మాస్క్‌ ధరించి పాల్గొన్నారు. నల్లని సూట్‌ ధరించి ‘ఐ స్టాండ్‌ విత్‌ ఫార్మర్స్‌’ అని రాసి ఉన్న మాస్క్‌ను వేసుకొని రెండ్‌ కార్పెట్‌పై ఫోటోలకు పొజులిచ్చారు. అనంతరం ఆమె తన ట్విటర్‌ ఖాతాలో ఆ ఫోటోను పోస్ట్‌ చేశారు. ‘అవార్డు వేడుకల్లోని రెడ్‌ కార్పెట్‌పై దిగే ఫోటోలకు మీడియా కవరేజ్‌ అధికంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే మీరు మీడియా ముందుకు వచ్చి స్వేచ్ఛగా భారత రైతులకు మద్దతు ప్రకటించండి’ అని ఆమె కామెంట్‌ జతచేశారు.

రైతులకు మద్దతు ప్రకటించిన లిల్లి సింగ్ పోస్ట్  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. ఇటీవల పర్యవరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌‌, ‌అమెరికన్‌  పాప్‌ సింగర్‌ రెహానా, పోర్న్‌ స్టార్‌ మియా ఖలీఫా తమ మద్దతును రైతులకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారి మద్దతుపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు నవంబర్‌లో సింగు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కనీస మద్దతు ధరపై చట్ట పరమైన హామీ ఇవ్వాలని ​కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

చదవండి: కాంక్రీట్‌ గోడ నిర్మాణం: రైతులపై కేసు నమోదు‌‌

>
మరిన్ని వార్తలు