వైరల్: డైలాగులకే దడ పుట్టించే ఫోజు..

17 Jul, 2021 21:17 IST|Sakshi
ఫొటో క్రెడిట్‌ : మీడియాడ్రమ్‌వరల్డ్‌.కామ్‌/ సీమోన్‌ నీదామ్‌

సింహంతో పోల్చుకుని తమను బిల్డప్‌ చేసుకోవటం సినిమాల్లోని హీరోలకే కాదు.. సామాన్య జనాలకూ చాయ్‌ బిస్కట్‌ తిన్నంత ఈజీ. జబ్బలు చరుస్తూ.. తొడలు కొడుతూ సింహం డైలాగులు చెప్పేస్తుంటారు. ఎవరినైనా ఎలివేట్‌ చేయాల్సి వస్తే.. సింహంతో పోలిక చూపటం కూడా పరిపాటి. అడవికి రాజైనా.. వైల్డ్‌ డైలాగులకైనా సింహం ఓ కేరాఫ్‌ అడ్రస్‌‌. ఫేమస్‌ అవ్వటానికి సింహం ఓ షార్ట్‌ కట్‌...

సింహం డైలాగుతోనే కాదు.. ఫొటో తీసి కూడా సూపర్‌ ఫేమస్‌ అయిపోవచ్చని నిరూపించాడు ఇంగ్లాండ్‌కు చెందిన సిమోన్‌ నీదామ్‌(52). దక్షిణాఫ్రికా, దక్షిణ జోహాన్నాస్‌బర్గ్‌లోని జీజీ కంజర్వేషన్‌ వైల్డ్‌ లైఫ్‌ రిజర్వ్‌ అండ్‌ లయన్‌ శాంక్షరీలో సింహానికి సంబంధించిన ఓ అద్భుతమైన ఫొటో తీశాడు. ఓ చిన్న మట్టి దిబ్బ.. దాని నిండా జంతువుల ఎముకలు.. ఆ మట్టి దిబ్బ మీద సింహంలా నిల్చున్న సింహం. బ్యాక్‌ గ్రౌండ్‌లో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. ఆ ఫొటో అటుఇటుగా లయన్‌ కింగ్‌ సినిమాలోని ఓ సన్ని వేశాన్ని తలపించేదిలా ఉంది.  ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి, నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వార్తలు