Australia Great Barrier Reef: పగడపు దిబ్బల ఉనికి దట్టమైన మేఘాలతోనే సాధ్యం!

28 Sep, 2021 21:11 IST|Sakshi

పెరుగుతున్న కాలుష్యం, పంటల కోసం విచ్చలవిడిగా వాడుతున్న పురుగుల మందులు తదితర కారణాల వల్ల సముద్రాల్లో అరుదైన పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం కనుక్కునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు సరికొత్త ఆధునిక టెక్నాలజీతో ఈ పరిస్థితిని అదుపు చేయాలని చూస్తున్నారు. అదేంటే తెలుసుకుందామా!

ఆస్ట్రేలియా: పగడపు దిబ్బుల గురించి చిన్నప్పుడూ కథలుగా విని ఉన్నాం గానీ వాటి గురించి పూర్తిగా తెలియదు. పగడపు దిబ్బలు సముద్రం అడుగ భాగాన ఏ‍ర్పడి ఎన్నో జీవరాశులకు నిలయంగా ఉంటాయి. పగడపు పాలిప్స్‌ నుంచి పగడపు దిబ్బలు ఏర్పడతాయి. చాలా పగడపు దిబ్బలు స్టోనీ పగడాల నుంచి ఏర్పడతాయి. పగడపు దిబ్బలు వెచ్చని, నిస్సారమైన నీటిలో ఉత్తమంగా పెరుగుతాయి. అలాంటి ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం కారణంగా వాతావరణ మార్పుల వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు కారణంగా అవి కనుమరగయ్యే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

(చదవండి: రూ. 8 కోట్లకు అమ్ముడుపోయిన ‘ది కంజురింగ్‌’ దెయ్యాల కొంప)

దీంతో శాస్త్రవేత్తలు క్లౌడ్ బ్రైటెనింగ్ ప్రాజెక్ట్ చేపట్టి ఆ పగడపు దిబ్బలను  సంరక్షించుకునే సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగాంగా శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాలో ఈశాన్య తీరంలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బలు ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గించేలా సముద్ర జలాలను ఆకాశంలోకి వెదజల్లే టర్బైన్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. దీంతో సముద్ర జలాలు ఆవిరిగా మారి సూక్ష్మమైన ఉప్పు కణాలు మాత్రమే వాతావరణంలో తేలుతాయని, వాటి చుట్టూ నీటి ఆవిరి ఘనీభవించి మేఘాలుగా ఏర్పడతాయని  సదరన్ క్రాస్ యూనివర్శిటీ సీనియర్ లెక్చరర్ డేనియల్ హారిసన్ వెల్లడించారు. ఈ విధంగా కొన్ని నెలలు తరబడి చేస్తే మునపటి వాతావరణంలా మార్పు చెంది పగడపు దిబ్బలు సురక్షితంగా ఉంటాయంటున్నారు.

వేసవిలో అత్యంత వేడుగాలుల కారణంగా పగడపు దిబ్బలు ఏవిధంగా తమ సహజ రంగును కోల్పోయి పాలిపోయి కనుమరుగయ్యే స్థితిలో ఉందో పరిశోధనల ద్వారా తెలుసుకోవడంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. సూర్య కాంతి ఎక్కువ్వడంతో  సముద్రపు నీరు వేడిక్కి  పాలిపోతుందని వెల్లడించారు. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించగలిగితే వేసవి కాలంలో కనీసం 6% ఉష్ణోగ్రత తగ్గితే పగడపు దిబ్బలు పాలిపోకుండా కాపాడగలం అని హారిసన్‌ పేర్కొన్నారు. దట్టమైన మేఘాల వల్లే కలుగు ప్రయోజనాలను కూడా ఈ పరిశోధనలు ద్వారా తెలుసుకోగలిగమని వివరించారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతరించిపోతున్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఆస్ట్రేలియా ప్రసిద్ధి గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌లో ఉన్న భారీ పగడపు దిబ్బలు ఉండటంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు హారిసన్ పేర్కొన్నారు. 

(చదవండి:  నా కెరియర్‌లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల)

మరిన్ని వార్తలు