భారీ కొండ చిలువతో చిన్నారి ఆటలు.. వీడియో వైరల్‌

3 Sep, 2022 18:38 IST|Sakshi

చిన్న పామును చూస్తేనే భయంతో ఆమడ దూరం పరిగెడతాం. అలాంటిది భారీ కొండ చిలువ కనిపిస్తే ఎలా ఉంటుంది. కానీ, ఓ చిన్న పాప.. భారీ కొండ చిలువతో ఆడుకుంటోంది. పడక గదిలో పాముతో చిన్నారి ఆటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పాముతో చిన్నారి ఆడుకుంటున్న వీడియోను స్నేక్‌మాస్టర్‌ఎక్సోటిక్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆ పాప పేరు అరియానాగా తెలిసింది. ఆమెకు పాములంటే చాల ఇష్టం. పాములను తన స్నేహితులుగా చూసుకుంటుంది. వివిధ రకాల పాములతో ఆడుకుంటున్న వీడియోలు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తాజాగా వైరల్‌గా మారిన వీడియోలో.. చిన్నారి బ్లాక్‌ పైథాన్‌ తోక పట్టుకుని లాగుతుంటుంది. ఆ పాము చిన్నారి నుంచి తప్పించుకుని బెడ్‌లోకి దూరేందుకు ప్రయత్నిస్తుంది. అది పడుకోవాలని భావిస్తోంది అని వీడియో క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోకు 20కేకుపైగా వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్ల నుంచి ఆందోళన చెందుతున్న సందేశాలు వచ్చాయి. పాములు బొమ్మలు కాదని పలువురు సూచించారు.

A post shared by Ariana (@snakemasterexotics)

ఇదీ చదవండి: సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే?


 

మరిన్ని వార్తలు