ఆన్‌లైన్‌​ గేమ్‌ ఆడుతుండగా భూకంపం..

31 Oct, 2020 16:09 IST|Sakshi

టర్కీ : గ్రీస్‌, పశ్చిమ టర్కీ దేశాల్లో శుక్రవారం భారీ భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 7.0 మాగ్నిట్యూడ్‌ల భూకంప తీవ్రత విళయాన్ని సృష్టించింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని వీడియోలు భూకంప పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. తాజాగా మరో భూకంప వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పాల్కన్‌ అనే వ్యక్తి లైవ్‌ స్ట్రీమింగ్‌లో గేమ్‌ ఆడుకుంటుండగా భూకంపం వచ్చింది. భూమి ఒక్కసారిగా కంపించటం మొదలుపెట్టే సరికి అతడు ఏమీ అర్థం కాక చుట్టూ చూశాడు. ( భారీ భూకంపం; భయంకరమైన అనుభవాలు )

భూమి కంపించటం పెరిగిపోయే సరికి అతడు భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టాడు. కొన్ని సెకన్ల పాటు ఆ గది పూనకం వచ్చినట్లుగా ఊగిపోయింది. దీంతో అందులోని వస్తువులన్నీ చెల్లాచెదురైపోయాయి. గార్డియన్‌ న్యూస్‌ అనే యూట్యూబ్‌ చానల్‌ ఈ వీడియోను తమ ఖాతాలో అప్‌లోడ్‌ చేసింది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ఇప్పటి వరకు లక్షకు పైగా వ్యూస్‌, వందల సంఖ్యలో కామెంట్లు సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు