వైరల్‌: చేప కడుపులో తాబేలు చక్కర్లు!

6 Mar, 2021 11:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఫ్లోరిడా :  బ్రతికున్న చేప కడుపులో ప్రాణాలతో ఉన్న తాబేలును గుర్తించారు బయోలజిస్టులు. ఈసంఘటన అమెరికాలోని ఫ్లొరిడాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..  కొద్దిరోజుల క్రితం ఫ్లోరిడాలోని ఫిష్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ బయోలజిస్టులు అక్కడి ఓ చెరువులో లార్జ్‌మౌత్‌ బాష్‌ చేపను పట్టుకున్నారు. అనంతరం దాన్ని ల్యాబ్‌కు తెచ్చి పరిశోధనకు ఉంచారు. దాని లింగాన్ని కనుగొనే నేపథ్యంలో పొట్టలో ఏదో కదులుతున్నట్లు వారు గుర్తించారు. జాగ్రత్తగా చేప నోటిని తెరిచి చూడగా ఓ బ్రతికున్న తాబేలు కనిపించింది. వెంటనే దాన్ని బయటకు తీసి చెరువులో వదిలేశారు.

లార్జ్‌మౌత్‌ బాష్‌ చేప కడుపులో బ్రతికున్న తాబేలును గుర్తించటం సాధారణంగా జరగదని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఆ పెద్ద నోటి చేప గట్టిగా ఉన్న తాబేలు పైచిప్పను ఎలా నమలగలననుకుంది’’.. ‘‘ తాబేలుకు భూమ్మీద నూకలున్నాయి’’.. ‘‘ బ్రతికున్న చేప కడుపులో తాబేలు బ్రతికుండటం.. ఓ అద్భుతం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి : గడ్డం గీయటానికి రూ. 4 లక్షల గోల్డ్‌ రేజర్‌

ఇంటర్వ్యూలలో ఫెయిల్‌.. బాధతో 9 ప్లాస్టిక్‌ సర్జరీలు

మరిన్ని వార్తలు