Liverpool Hospital Taxi Explosion: టాక్సీ డ్రైవర్‌ సాహసం.. సూసైడ్‌ బాంబర్‌ని కారులోనే బంధించి 

15 Nov, 2021 12:54 IST|Sakshi

లివర్‌పూల్‌ ఆస్పత్రి వద్ద పేలుడు

సూసైడ్‌ బాంబర్‌ని కారులో బంధించిన డ్రైవర్‌

టాక్సీ డ్రైవర్‌ సాహసంతో తప్పిన పెను ముప్పు

లండన్‌: రిమెంబరెన్స్‌ డే సర్వీస్‌ సందర్భంగా లివర్‌పూల్‌ నగరంలోని మెటర్నటీ ఆసుపత్రి వెలుపల జరిగిన కారు పేలుడులో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు సంభవించడానికి ముందు ఓ టాక్సీ డ్రైవర్‌ చాకచక్యంగా వ్యహరించి.. ఉగ్రవాదిని అడ్డుకోవడంతో ఒక్కరు మాత్రమే మరణించారు. లేదంటే డజన్ల కొద్ది జనాల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ప్రస్తుతం సదరు టాక్సీ డ్రైవర్‌ని హీరోగా కొనియాడుతున్నారు లండన్‌ వాసులు. ఆ వివరాలు.. 

బాంబర్‌ లివర్‌పూల్‌లో రిమెంబరెన్స్‌ డే సర్వీస్‌ వద్దకు చేరుకుని.. తనను తాను పేల్చుకుని మారణహోమం సృష్టించాలని భావించాడు. ఈ క్రమంలో తన శరీరం మీద పేలుడు పదార్థాలను అమర్చుకుని లివర్‌పూల్‌కు వెల్లడానికి క్యాబ్‌ ఎక్కాడు. అయితే ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో.. క్యాబ్‌ను లివర్‌పూల్‌ మెటర్నటీ ఆస్పత్రి వద్దకు డైవర్ట్‌ చేశారు.


(చదవండి: యూకే లివర్‌పూల్‌ నగంలో కారు బ్లాస్ట్‌...ఒకరు మృతి)

ఆస్పత్రి వద్దకు వెళ్తుండగా.. తన కారులో కూర్చున్న వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో టాక్సీ డ్రైవర్‌ అతడిని ఓ కంట కనిపెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్దకు వచ్చే లోపు తన కారులో ఉన్న వ్యక్తి సూసైడ్‌ బాంబర్‌ అని టాక్సీ డ్రైవర్‌కు అర్థం అయ్యింది. మెటర్నటీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే టాక్సీ డ్రైవర్‌ వెంటనే కిందకు దిగి బాంబర్‌ని క్యాబ్‌లో లాక్‌ చేశాడు. 


(చదవండి: కాబుల్‌ మరోసారి దద్దరిల్లింది.. రాకెట్‌ దాడిగా అనుమానం)

అనంతరం బాంబర్‌ల కారులో ఉండే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ప్రమాదంలో బాంబర్‌ మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తన సమయస్ఫూర్తి, సాహసంతో ఎందరో ప్రాణాలు కాపాడిన టాక్సీ డ్రైవర్‌కు చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. టాక్సీ డ్రైవర్‌ చూసిన సాహసం తెలుసుకున్న ప్రజలు అతడిని నిజమైన హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి: భారీ పేలుడు.. రద్దీమార్కెట్‌ మొత్తం రక్తసిక్తం

మరిన్ని వార్తలు