కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం

3 Oct, 2020 08:07 IST|Sakshi

లండన్‌: పూర్తిగా వాసననుగానీ, రుచినిగానీ కోల్పోవడం కరోనా వైరస్‌ ఉందని చెప్పడానికి అత్యంత విశ్వసనీయ లక్షణమని, ప్రపంచవ్యాప్తంగా సెల్ఫ్‌ ఐసోలేషన్, పరీక్షలు, ఎవరెవరికి సోకిందో తెలుసుకోవడానికి ఈ లక్షణాలను ప్రధానాధారంగా చేసుకొని గుర్తించాల్సి ఉంటుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇటీవల వారు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడైనట్లు చెప్పారు. ఈ పరిశోధనలో భాగంగా లండన్‌లోని ప్రైమరీ కేర్‌ సెంటర్స్‌లోని, 567 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించి, వారిలో 78 శాతం మంది అకస్మాత్తుగా వాసన, రుచిని కోల్పోయినట్లు గుర్తించారు. వీరిలో 40 శాతం మందికి జ్వరంల కానీ, దగ్గు గానీ లేవని తెలిపారు. 

(కరోనా ఎప్పుడొచ్చిందో.. ఎప్పుడు పోయిందో! )

మరిన్ని వార్తలు