వెరైటీ లవ్‌ ప్రపోజల్‌ : వైరల్‌ వీడియో

2 Mar, 2021 13:50 IST|Sakshi

స్కైడైవింగ్‌ చేస్తూ గాల్లో లవ్‌ ప్రపోజల్‌

సోషల్‌మీడియా ఫిదా

ప్రమాదకర ఫీట్‌ అంటూ కోప్పడుతున్న నెటిజన్లు 

సాక్షి, న్యూఢిల్లీ: ఈ ప్రపంచంలో తమ ప్రేమ చాలా ప్రత్యేకం అని ప్రతీ ప్రేమికుడు భావిస్తాడు. అంతేకాదు తమ ప్రేమను ప్రకటించేందుకు నానా తంటాలు పడతారు. లవ్ ప్రపోజల్ ఎప్పటికీ గుర్తిండిపోయేలా వెరైటీగా ఉండేలా లవర్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తూ  ఉంటారు. రకరకాల ఫీట్లతో విభిన్నంగా  ప్రయత్నిస్తారు . తాజాగా లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌ అనే మాటలను అక్షరాలా ఆచరించి చూపించాడో లవర్‌. ఏకంగా స్కైడైవింగ్ సమయంలో తన ప్రేయసికి ప్రపోజ్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో  వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియోను వింగ్‌ మ్యాన్‌స్కైడైవ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌  పోస్ట్ చేశారు. "స్కైడైవ్ వివాహ ప్రతిపాదన" అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఈ వీడియో నెటిజనులను, ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రే అనే ప్రేమికుడు, తన గర్ల్‌ఫ్రెండ్‌ కేటీతో కలిసి స్కైడైవింగ్ చేస్తున్నప్పుడు "ఐ లవ్ యూ" అంటూ తన ప్రేమను ప్రకటించాడు. ఈ హఠాత్పరిణామానికి కేటీ సర్‌ప్రైజ్‌ అవుతూ థ్యాంక్స్‌ చెప్పింది. ఇంతలో  తన నోటిలో దాచుకున్న ఉంగరాన్ని తీసి మరీ తన ప్రేమను వ్యక్తంచేశాడు. ‘రోజు రోజుకు నీ ప్రేమలో మరింత మునిగిపోతున్నాను. నన్నుపెళ్లి చేసుకుంటావా’ అంటూ మెరిసిపోతున్న మబ్బుల నడుమ రే ముద్దుగా అడిగాడు. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన ఆమె కూడా ఓకే చెప్పేసింది.  ఇక ఏ ప్రేమికుడు ఎగిరి గంతేయకుండా ఉంటాడు. రే ఆల్‌రడీ గాల్లోనే ఉన్నాడుగా..అందుకే మరింత ఉత్సాహంగా కేకలు వేశాడు. దీనిపై సోషల్‌ మీడియా యూజర్లు సంతోషం  వ్యక్తం చేస్తున్నారు. ఈ లవ్‌ బర్డ్స్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదకర ఫీట్‌పై కొంతమంది నెటిజన్లు  కోపాన్ని  ప్రదర్శించడం విశేషం.

A post shared by Wingman (@wingmanskydive)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు