అయ్యో.. కుళ్లిన శవం, పీక్కుతిన్న పెంపుడు పిల్లులు

6 Jun, 2021 09:35 IST|Sakshi

స్పెయిన్​లో ఘోరం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న ఓ పెద్దావిడ చనిపోగా, ఆ విషయం మూడు నెలల దాకా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. ఇక ఆమె పెంచుకుంటున్న పిల్లులు ఆకలికి తాళలేక ఆమె మృతదేహాన్నే పీక్కుతిన్నాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మాడ్రిడ్​: క్లారా ఇనెస్​ టోబోన్(79) అనే ఆవిడ నగరంలోని ఓ అపార్ట్​మెంట్​లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉంటోంది. ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు ఆమె కొన్ని పిల్లుల్ని పెంచుకుంటోంది. పోయిన సొమవారం ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తలుపులు బద్ధలు కొట్టిన పోలీసులు అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. ఆమె రెండు పెంపుడు పిల్లులు.. కుళ్లిన ఆమె శవాన్ని పీక్కుతింటూ కనిపించాయి. 

కరోనా అనే అనుమానంతో.. 
ఇక ఈ కేసులో దారుణమైన విషయం ఒకటి బయటపడింది. క్లారా, కొలంబియా నుంచి మాడ్రిడ్​కు వలస వచ్చింది. 1996 నుంచి శాన్​ కుగట్​ సెల్​ వాల్లెస్​లో ఒంటరిగా ఉంటోంది. పోయినేడాది ఆమె జబ్బుపడింది. దీంతో ఆమెకు కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఎవరూ సాయం అందించలేదు. కొన్ని నెలల క్రితం ఆమె దగ్గుతూ కనిపించిందని కొందరు చెప్పారు. వీధిలో పిల్లులకు ఆహారం పెట్టిందని, మార్కెట్​ నుంచి సరుకులు తెచ్చుకుందని, ఆమెను చూడడం అదే చివరిసారని చుట్టుపక్కల వాళ్లు చెప్తున్నారు. కాగా, క్లారా మృతదేహాం నడుం పైభాగం వరకు పూర్తిగా కుళ్లిపోయి ఉంది. ఆమె పెంపుడు పిల్లులో అయిదు అక్కడే చచ్చిపడి ఉన్నాయి.  చచ్చిన పిల్లుల కడుపులో ఆమె అవశేషాలున్నాయా? అనేది గుర్తించేందుకు వాటి శవాల్ని ల్యాబ్​కు పంపించారు. 

ఆమె శవాన్ని పీక్కతుంటూ కనిపించిన రెండు పిల్లులూ.. దీనావస్థకి చేరుకున్నాయి. దీంతో వాటిని యానిమల్ షెల్టర్​కు తరలించారు. క్లారా కరోనాతో చనిపోయిందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. కాగా, ఆమెకు బంధువులు ఎవరూ లేరని, డైజెనెస్​ సిండ్రోమ్​ డిజార్డర్​(శుభ్రత పాటించకపోవడం, చెత్తను పోగు చేసుకోవడం)తో ఆమె బాధపడుతోందని, అందుకే ఆమెకు దగ్గరగా ఎవరూ వెళ్లేవాళ్లు కారని ఆ హౌజింగ్ అసోషియేషన్​ హెడ్ చెబుతున్నాడు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో అరుదైన ప్రయోగం

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు