గాంధీజీ కళ్లజోడు.. జీవితాన్నే మార్చేసింది!

22 Aug, 2020 19:13 IST|Sakshi

ప్రిటోరియా: దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ ధరించిన బంగారు వృత్తాకారపు కళ్లజోడు ఇటీవల వేలం పాటలో అత్యంత భారీ మొత్తానికి అమ్ముడు పోయింది. మూడు వారాల క్రితం దక్షిణాఫ్రికాలోని బ్రిస్టల్‌ల్లో నిర్వహించిన ఈ వేల పాటలో ఆ కళ్లజోడు సుమారు 260,000 పౌండ్లకు అమ్ముడుపోడంతో దాని యాజమాని హర్షం వ్యక్తం చేశాడు. ఈ కళ్లజోడును దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో మహత్మా గాంధీ ధరించారు. ఈ అరుదైన వస్తువును ఆమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. గాంధీజీ కళ్లద్దాలకు రిజర్వ్ ధరను 15,000 పౌండ్లగా నిర్ణయించారు. అయితే దీనిని సొంతం చేసుకునేందుకు భారతదేశంతో సహా వివిధ దేశాల నుండి చాలా మంది ఆసక్తిచూపించినట్లు వేలం పాట నిర్వహకుడు ఆండీ స్టోవ్ పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా స్టోవ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. “ఇది అద్భుతమైన ఫలితం. ఇప్పటికీ నమ్మలేకపోతున్న. ఇంత మొత్తంలో ఈ  కళ్లజోడు వేలానికి పోతుందని ఎవరూ కూడా ఊహించలేదు. నిజానికి ఈ కళ్లద్దాలు దాదాపు 50 ఏళ్లుగా తమ ప్రదర్శన శాలలోనే ఉంటోంది. అయితే కొంతమంది దీనిని వేలంలో ఎవరూ కొనరని, పనికి రాని వస్తువుగా చూసేవారు. దీనిని బయటపడేయడమే ఉత్తమమంటూ దీని యాజమానికి పలువురు సూచించారు. అయితే ఈ కళ్లజోడు యాజమాని ఓ వృద్ధుడు. అతడి కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వేలంలో ఊహిం‍చనంతా మొత్తానికి అమ్ముడుపోడంతో అతడి జీవితాన్నే మార్చేసేంతా డబ్బును అతడు పొందాడు’ అని పేర్కొన్నాడు. అయితే కళ్లద్దాలను కొనుగోలును సొంతం చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా భారత్‌, ఖతార్‌, కెనడా, రష్యా, అమెరికా నుంచి పాల్గొన్నారని చెప్పాడు. అయితే దీనిని 1920-1930 మధ్య కాలంలో గాంధీజీ దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం తిరిగి భారత్‌కు వెళ్లేటప్పుడు సదరు వృద్దుడి మామకు ఇచ్చినట్లు స్టోవ్‌ వెల్లడించాడు.

ఇది దాదాపు దశాబ్ధాలుగా వారి వద్దే ఉంటోందని, గాంధీ ఇక్కడకు వచ్చినప్పుడు వృద్ధుడి మామ దక్షిణాఫ్రికాలోని బ్రిటిష్‌ పెట్రోలియంతో కలిసి పనిచేసేవాడని చెప్పాడు. భారత్‌లో గాంధీ స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ చాలా సంవత్సరాలు గడిపారని, ఆ సమయం‍లో గాంధీజీ వారి ఇంట్లోనే నివిసించినట్లు అతడు తెలిపాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా గాంధీ ఈ కళ్లజోడును వారికి బహుకరించారని స్టోవ్‌ వెల్లడించాడు. అయితే ఈ  కళ్లద్దాలు మొత్తం బంగారు పూతతో ఉండి ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లతో ఇమిడి ఉంటుందని అతడు చెప్పాడు. ఇక ముక్కు పట్టి కూడా బంగారంలోనే ఉంటుందన్నాడు. ఈ వేలంలో గాంధీకి సంబంధించిన పలు వస్తువులలో ఈ అద్దాలు ఉత్తమైనవే కాకుండా మొత్తం ప్రదర్శనలో ఐకానిక్‌గా నిలిచిందని స్టోవ్‌ తెలిపాడు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా