కరోనాతో గాంధీ మునిమనవడు మృతి

23 Nov, 2020 11:21 IST|Sakshi

జోహన్నెస్‌బర్గ్: కరోనా వైరస్‌ కారణంగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో మరణించారు. ఆయన కరోనా వైరస్‌తో మృతి చెందినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా తెలిపారు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరిన తన సోదరుడికి కరోనా వైరస్‌ కూడా సోకిందని తెలిపారు. ఆయన నెల రోజుల నుంచి ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న సతీష్‌కి ఆదివారం హఠాత్తుగా గుండెపోటు రావటంతో మృతి చెందారని ఆమె సోషల్‌ మీడియలో వెల్లడించారు. ఆయనతో పాటు సోదరి ఉమా, మరో సోదరి కీర్తి మీనన్ జోహన్నెస్‌బర్గ్‌లో నివసిస్తున్నారు. చదవండి: ఆ రెండు మార్కెట్ల మూసివేత: ఆదేశాలు వెనక్కి!

వీరు ముగ్గురు మహాత్మా గాంధీ చూపిన మార్గంలో రెండు దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సతీష్ ధుపేలియా మీడియా రంగంలో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. గాంధీ ప్రారంభించిన ‘గాంధీ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్’ ద్వారా అనేక సేవలు అందింస్తూ.. సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు. సతీష్‌ ధుపేలియా, ఉమా ధుపేలియా, కీర్తి మీనన్ వీరు ముగ్గురు మహాత్మాగాంధీ రెండో కుమారుడు మనీలాల్ గాంధీ వారసులు. చదవండి: భోజనం డబ్బు మా నాన్న తినేస్తున్నాడు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు