వైరల్‌ వీడియో: ముఖం మొత్తం మేకప్‌.. చూస్తే గానీ తెలియదు!

17 Jul, 2021 21:58 IST|Sakshi

వాషింగ్టన్‌: కాలం వేగంగా మారిపోతోంది. దాంతో పాటు మనుషుల అలవాట్లు మారుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వయసు దాచుకోవాలని చూస్తున్నారు. అందుకే బ్యూటీ పార్లర్లకు ఫుల్‌ గిరాకీ. మరోవైపు అందంగా కనిపించాలంటే చాలా సమయం, శ్రమ వెచ్చించాలనుకుంటారు చాలా మంది అమ్మాయిలు. అయితే తాజాగా ఓ అమ్మాయి వేసుకున్న మేకప్‌ నెటిజన్లకు పరీక్ష పెడుతోంది. చూస్తే గానీ ఏది ముక్కు, ఏవి పెదాలు, ఏవి కళ్లు తెలియడం లేదు. ఈ వీడియోలోని ముఖం మొత్తం కళ్లు, పెదాలు, చెవులు ఉన్నాయి.

ఈ వీడియోను అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. తెగ వైరలవుతోంది. మేకప్‌ వేసుకున్న అమ్మాయి పెదవులపై లిప్‌స్టిక్‌ను పెట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ, కళ్లు తెరిచే సరికి అసలు విషయం తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోను 4.70 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ ఈ వీడియో నన్ను కాసేపు అయోమయంలో పడేసింది. ఏంటి ఈ పరీక్ష?’’ అంటూ కామెంట్‌ చేశారు. మరో నెటిజన్‌ ‘‘మేకప్‌ అదిరిపోయింది. అరే ఏవి ఎక్కడ వున్నాయో తెలియడం లేదు.. గోడపై పెయింటింగ్‌లా భలే ఉంది.’’ అంటూ చమత్కరించాడు.

మరిన్ని వార్తలు